చదువులకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించిన 108 ఏళ్లు బామ్మ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తమిళనాడులోనిథేని జిల్లాకు చెందిన కమలకన్నివయసు 108 ఏళ్లు. చదువులకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. కేరళప్రభుత్వం నిర్వహించిన పరీక్షలలో పాసై తమిళం, మలయాళభాషలను నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రెండో తరగతి వరకు చదివిన కమలకన్ని కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి వలసపోయి కూలీపనులను చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు.పేదరికం కారణంగా చిన్నప్పుడు చదవలేకపోయిన కమలకన్నికి ఇటీవలే చదవాలనే కోరిక కలిగింది. కేరళ ప్రభుత్వ నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమం సంపూర్ణ శాస్త్ర  భాగంగా తమిళమలయాళ భాషలకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్నారు. అక్కడి ప్రభుత్వ శిక్షణా సంస్థలో చేరి పట్టుదలగా చదివారు. తన మాతృభాష తమిళంఅటు మలయాళ భాషను నేర్చుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు భాషలలో రాయగలుగుతున్నారు. ఈ పరీక్షలలో ఆమె 100 మార్కులకు గాను 97మార్కులు సంపాదించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.