14 ఏండ్ల క్రితం.. అదే శుక్రవారం..కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు యాక్సిడెంట్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రైల్ పట్టాలపై మరణ మృదంగం మోగింది ! కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బీభత్సం సృష్టించింది. ఆగివున్న గూడ్స్‌ రైలును అత్యంత వేగంగా ఢీకొనడమే కాకుండా పట్టాలు తప్పి మరో ట్రాక్‌పై పడిపోవడం.. అదేసమయంలో దాన్ని మరో సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ వచ్చి ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది.పట్టాలపై మరణ మృదంగం మోగింది ! కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బీభత్సం సృష్టించింది. ఆగివున్న గూడ్స్‌ రైలును అత్యంత వేగంగా ఢీకొనడమే కాకుండా పట్టాలు తప్పి మరో ట్రాక్‌పై పడిపోవడం.. అదేసమయంలో దాన్ని మరో సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ వచ్చి ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఫలితంగా భారత దేశ చరిత్రలోనే అత్యంత ఘెర రైలు ప్రమాదంగా మిగిలిపోయింది. ఈ క్రమంలోనే 14 ఏండ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా? కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ శుక్రవారం నాడే కాదు.. 14 ఏండ్ల క్రితం కూడా ఇలాగే పట్టాలు తప్పింది. 2009లో ఫిబ్రవరి 13వ తేదీన జైపూర్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ దాటుతుండగా ప్రమాదానికి గురైంది. ట్రాక్‌ మార్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంజిన్‌ మరో ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది మరణించారు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ యాక్సిడెంట్‌ జరిగిన రోజు కూడా శుక్రవారమే. ప్రమాదం జరిగిన సమయం కూడా రాత్రి 7:30 నుంచి 7:40 గంటల మధ్యలోనే. దీంతో ఇప్పుడు ఈ విషయం వైరల్‌గా మారింది. 14 ఏండ్ల క్రితం జరిగినట్లుగానే ఇప్పుడు కూడా అదే శుక్రవారం.. ఇంచుమించు అదే సమయంలో ప్రమాదం జరగడంతో దీని గురించి అంతా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే అదుపుతప్పడంతో మృతుల సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఈ సారి పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఊహించలేని విధంగా పెరిగిపోయింది.

Leave A Reply

Your email address will not be published.