బి.సి .ఉద్యమాల సంవత్సరంగా 2023  చరిత్రలో మిగలాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2023 సంవత్సరంను బి.సి. ఉద్యమాల సంవత్సరామ్గా చరిత్రలో నిలిచిపోవాలని బి.సి.లకు అన్నీ రంగాలలో వ్యాఖ్యాoగా విధ్యా, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాలలో జనాభా ప్రకారా వాటా ఈవ్వలని జాతీయ బి.సి. సేనా సమావేశం డిమాండ్ చేసింది. నూతన సంవత్సరం సంధర్భంగా బి.సి. సేనా కోర్ కమిటీ సమావేశం బి.సి. భవన్ లో సంఘం అద్యక్షులు బర్క కృష్ణ నాయకత్వంలో జరిగింది. ఈ సమావేశానికి  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ,రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా      ఆర్. కృష్ణయ్య  ప్రసంగిస్తూ  జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ రంగాలలో,స్థానిక సంస్థల ఎన్నికలలో , కేంద్రంలో 27 శాతం నుంచి 50శాతం పెంచాలని, చట్టసభలలో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని అలాగే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో బి.సి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బి.సి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి.ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలని కోరారు. బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలని, బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సమావేశంలోబర్కకృష్ణ, నీలవెంకటేష్, రాజ్ కుమార్, శ్రీశైలం, రాజేంధర్, మహేశ్, కుమార్, యాదగిరి చారి,దీపిక తదితరులు పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.