28 ఏళ్లకే ఏకంగా 24 పెళ్లిళ్లు.. వీడెవడండి బాబు

కోల్ కత్తా అక్టోబర్ 1 వీడెవడండి బాబు ఏకంగా 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒక భార్యను మెయింటేన్ చేయడానికే కిందా మీద పడుతున్న ఈ రోజుల్లో ఏకంగా 23 మంది భార్యలను చేసుకొని మరీ భద్రంగా ఉన్నాడు. 24వ భార్యకు డౌట్ రావడంతో వీడి ఆటకట్టైంది.యువకులకు పెళ్లిళ్లు కావడం ఇప్పుడు పెద్ద టాస్క్ లా మారింది. ఇలా ఆపోసోపాలు పడుతున్న యువకులు ఓవైపు ఉంటే.. మరోవైపు ఒకడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇదే ఆశ్చర్యం కలుగుతోంది.28ఏళ్లకే ఈ కేటుగాడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకోవడమే అందరినీ షాక్ కు గురిచేస్తున్న అంశం. పశ్చిమ బెంగాల్ కు చెందిన అసబుల్ మొల్లా (28) పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. మూడు పదులు రాకముందే ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. బీహార్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.ఇలా ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు.. ఏకంగా 24 మంది యువతులను మోసం చేసి వివాహం చేసుకున్నాడు. నకిలీ గుర్తింపులు సృష్టించి ఊరు పేరు మార్చుకుంటూ యువతులకు మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు. వారి నుంచి డబ్బు నగలు తీసుకొని పరారయ్యాడు.ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని సాగర్దిగ్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ఇలానే వివాహం చేసుకున్నాడు. గతంలో యువతులను మోసం చేసినట్టే ఈమె నుంచి డబ్బు నగలు తీసుకొని పరారయ్యాడు. దీంతో తాను మోస పోయానని గ్రహించిన సదురు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు.ఎట్టకేలకు ఇతగాడు చిక్కాడు. పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆరా తీస్తే ఏకంగా 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్నట్టు తేలింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఒక పెళ్లికే దిక్కులేదంటే.. 24 పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావ్ రా. ఏంట్రా ఇదీ స్వామీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాడికి కఠినమైన శిక్ష విధించాలని.. మరోసారి పెళ్లి అంటేనే భయపడేలా చేయాలని వధువులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.