మాజీ సీఎం అడ్డగోలు ఖర్చు 3 లక్షల కోట్ల రూపాయలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బిఆర్ఎస్ పాపాల పుట్ట పెరిగిపోతుంది . కాగ్ తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తవ్వే కొద్దీ పాపాల పుట్ట వెలికి వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం, గొర్రెల పథకంలో నిధుల గోల్ మాల్ ధరణి వంటి కుంభకోణాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కాగ్ ఇచ్చిన నివేదిక చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. కేసీఆర్ అవినీతి అక్రమాలు ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే కాగ్ రిపోర్ట్ మరో ఎత్తుగా పరిగణించాలి. గులాబీ బాస్ కెసీఆర్ రెండు కోట్ల 88 లక్షలు 811 కోట్ల రూపాయలను కెసీఆర్ ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కెసీఆర్ విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. పదేళ్ల క్రితం అధికారంలో వచ్చిన కెసీఆర్ ప్రభుత్వం ఏడాదికి ఏడాదికి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిధులను ఖర్చు చేసుకుంటూ వెళ్లింది. ఆర్థిక క్రమశిక్షణను కెసీఆర్ విస్మరించారని కాగ్ నివేదిక పేర్కొంది. బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం రాష్ట్రానికి అదనపు ఖర్చులు లేవని కాగ్ నివేదిక బయటపెట్టింది. నిబంధనలను కెసీఆర్ పూర్తిగా తుంగలో తొక్కారు. ఇంకా ఎన్ని నిధుల్ని కెసీఆర్ ఎలాంటి అనుమతులు లేకుండానే ఖర్చు చేశారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారడానికి కెసీఆర్ ప్రధాన కారణమని కాగ్ నివేదిక బయటపెట్టింది. అప్పుల నుంచి బయటపడాలని ప్రణాళికా సంఘం హెచ్చరిస్తున్నప్పటికీ కెసీఆర్ పట్టించుకోలేదని కాగ్ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.