టీఎస్ పిఎస్సి నుండి 3 అప్ డేట్స్

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : అక్టోబర్ 16న తెలంగాణలో(Telangana) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉద్యోగ పరీక్ష గ్రూప్ 1. దీనిలో ప్రశ్నల స్థాయి సివిల్స్ ను(Civils) మించి ఉన్నాయి. అయితే కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాల్లో(Social Media) జరుగుతున్న ప్రచారంపై టీఎస్పీఎస్సీ(TSPSC) ఓ స్పష్టతనిచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. ఈ ప్రిలిమినరీ పరీక్ష(Preliminary Exam) అనేది ఓ వడపోత పరీక్ష మాత్రమే అని తెలిపింది. దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల మెరిట్ ఆధారంగానే మెయిన్స్ కు ఎంపిక చేస్తామని.. దీనికి ప్రత్యేకంగా 40 శాతం, 35 శాతం, 30 శాతం వస్తే అర్హత సాధించినట్లు అనే నిర్ధిష్ట మార్కులు కేటాయించడం లేదంటూ తెలిపింది. మెరిట్ సాధించిన అభ్యర్థులను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కేటగిరీ వారీగా మెయిన్స్ కు ఎంపిక చేస్తామని తెలిపింది. మొత్తం 503 పోస్టులకు 25,150 మంది అర్హత సాధిస్తారని.. వారికి మాత్రమే మెయిన్స్ పరీక్ష రాసే వెసులుబాటు ఉంటుందని ట్విట్టర్ ద్వారా టీఎస్పీఎస్సీ సెక్రటరీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.