గాజాపై కురిసిన 6వేల బాంబులు.. వైట్ పాస్ప‌ర‌స్‌తోనూ అటాక్‌ !

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాకెట్ల‌తో హ‌మాస్ దాడి చేసిన నేపథ్యంలో.. ఇజ్రాయిల్ కౌంట‌ర్ అటాక్మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌ర దాడులు చేసింది. అయితే గ‌త శ‌నివారం నుంచి జ‌రుగుతున్న దాడుల్లో సుమారు ఆరు వేల బాంబుల‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం గాజాపైనే ఆరు వేల బాంబులు వేసిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఆ బాంబులు దాదాపు 4వేల ట‌న్నులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. గాజాలో ఉన్న హ‌మాస్ ప్రాంతాల‌పై బాంబుల‌తో ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. త‌మ వైమానిక ద‌ళం సుమారు 3600 టార్గెట్ల‌ను అటాక్ చేసిన‌ట్లు ఇజ్రాయిల్ వైమానిక ద‌ళం పేర్కొన్న‌ది.హ‌మాస్ ఆకస్మిక దాడుల‌కు కౌంట‌ర్ అటాక్ ప్రారంభించిన ఇజ్రాయిల్ వైఖ‌రిపై మాన‌వ‌హ‌క్కుల సంఘం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. త‌మ దాడుల‌ కోసం ఆ దేశం వైట్ పాస్ప‌ర‌స్‌ను వాడిన‌ట్లు భావిస్తున్నారు. వివాదాస్ప‌ద వైట్ పాస్ప‌ర‌స్ మందును.. గాజా స్ట్రిప్‌తో పాటు లెబ‌నాన్‌లో ఉన్న టార్గెట్ల‌పై వాడిన‌ట్లు తెలుస్తోంది. చాలా వేగంగా అంటుకునే గుణం ఉన్న ఆ ర‌సాయ‌నాన్ని.. సాధార‌ణంగా మిలిట‌రీ వాడుతుంది. వైట్ పాస్ప‌ర‌స్ వ‌ల్ల శ‌రీరం కాలిపోయే ప్ర‌మాదం ఉంటుంది. ఆయుధంగా ఆ ర‌సాయ‌నాన్ని వాడితే ప్ర‌మాదాలు తీవ్రంగా ఉంటాయి. జ‌న సాంద్ర‌త ఉన్న ప్ర‌దేశాల్లో ఆ రసాయ‌నాన్ని ఎక్కువ‌గా వాడుతుంటారు. వైట్ పాస్ప‌ర‌స్ వాడ‌డం లేద‌ని ఇజ్రాయిల్ పేర్కొన్నా.. కొన్ని వార్తా సంస్థ‌లు తీసిన ఫోటోల్లో ఆ ర‌సాయ‌నాన్ని వాడిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.గాజాలెబ‌నాన్‌లో వైట్ పాస్ప‌ర‌స్‌కు చెందిన బాంబులు పేలిన‌ట్లు ఉన్న కొన్ని ఫోటోల‌ను మాన‌వ హ‌క్కుల సంస్థ రిలీజ్ చేసింది. ఆకాశంలో ఏర్ప‌డిన తెల్ల మ‌బ్బుల‌కు చెందిన ఫోటోల ఆధారంగా వైట్ పాస్ప‌ర‌స్ ర‌సాయ‌నంతో దాడి జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఆక్సిజ‌న్‌తో క‌లిసిన‌ప్పుడు వైట్ పాస్ప‌ర‌స్ మండుతుంది. ఆ మంట‌తో తెల్ల పొగ క‌మ్ముకుంటుంది. అంత‌ర్జాతీయ చ‌ట్టాల ప్ర‌కారం ఆ ర‌సాయ‌నాన్ని బ్యాన్ చేయ‌లేదు. కానీ ఆ ర‌సాయ‌నం వ‌ల్ల మ‌నుషుల‌కు ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌తంలో స్మోక్ అటాక్ కోసం వైట్ పాస్ప‌ర‌స్‌ను ఇజ్రాయిల్ వాడింది.

Leave A Reply

Your email address will not be published.