మోడీ సర్కార్ లో 7.5 లక్షల కోట్ల అక్రమాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ప్ర‌ధాని మోదీతో పాటు ఆయ‌న క్యాబినెట్‌పై త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కాగ్ రిపోర్టు ఇచ్చిన అక్ర‌మాల‌పై ప్ర‌ధాని మోదీ స్పందించ‌డంలేద‌ని ఆరోపించారు. 2024 ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. కాషాయ పార్టీ ఆగ‌డాల‌ను ఆపేందుకు ప్ర‌జ‌లంతా ఏకం కావాల‌న్నారు. మ‌త‌, విభ‌జ‌న‌, నిరంకుశ‌, కార్పోరేట్ రాజ‌కీయాల‌ను త‌రిమికొట్టాల‌న్నారు. స్పీకింగ్ ఫ‌ర్ ఇండియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన స్టాలిన్‌.. కాగ్ ఇచ్చిన రిపోర్టుపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు.ఇండియా కూట‌మి అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్లు మోదీ ఆరోపిస్తున్నార‌ని, కానీ మోదీ పాల‌న‌లో దాగిన అవినీతిని కాగ్ ఎత్తిచూపింద‌ని, ఆ రిపోర్టును మీరు చ‌దివారా, ప్ర‌త్యేక పార్ల‌మెంట్ సెష‌న్‌లో దాని గురించి చ‌ర్చించారా అని స్టాలిన్ అడిగారు. మోదీ స‌ర్కార్‌లో సుమారు 7.5 ల‌క్ష‌ల అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు కాన్ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది. దీని పై మోదీ త‌న మౌనాన్ని వీడాల‌న్నారు. బీజేపీ ప్ర‌భుత్వంలో అయిదు సీలు ఉన్నాయ‌ని, క‌మ్యూనలిజం(మ‌త‌త‌త్వం), క‌ర‌ప్ష‌న్‌(అవినీతి), కార్పొరేట్ పెట్టుబ‌డిదారులు(కార్పొరేట్ క్యాపిట‌లిజం), చీటింగ్‌, క్యారెక్ట‌ర్ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని స్టాలిన్ ఆరోపించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.