ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన ప్రవేట్ రంగం సంస్థల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి

.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపి జర్నలిస్ట్ అధ్యయన వేదిక రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పెడతాం భవిషత్ లో అన్ని జిల్లాల్లో ప్రజలను చైతన్యం చేసేలా కాంగ్రెస్ కార్యక్రమాలు,పోరాటాలు ఉంటాయితెలంగాణ ఉద్యమంలో స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదం తో పనిచేశాం రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పరిస్థితులు లేవు ప్రభుత్వం ఆర్టీసి కార్మికుల నోరు నొక్కేసిన పరిస్థితి చూశాం దేశంలో అనేక రాష్ట్రాల్లో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయికానీ ఉద్యమం నినాదంగా ఉన్న స్థానికులకే ఉద్యోగాల అంశాన్ని కేసీఆర్ పక్కన పెట్టాడుదీనిపై ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలిప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన సంస్థల్లో స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు ఉన్నాయో కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలితెలంగాణ వచ్చాక ప్రజలు పెన్నం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందిరాష్ట్రంలో యువతను మద్యం,గంజాయి కి అలవాటు పడేలా చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం యువతను తాగుబోతులు గా క్రిమినల్స్ గా తయారు చేస్తోంది దీనిపైన మనం పోరాటాలు చేయక పోతే యువత నిర్వీర్యం అవుతుందిరాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది

.. ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు

రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై బైండోవర్ కేసులు పెడుతున్నారు గతంలో ప్రజా సంఘాలు,జర్నలిస్ట్ సంఘాలు మేధావులు ప్రశ్నిస్తే ప్రభుత్వాలు భయపడేవికానీ కేసీఆర్ సర్కార్ నిస్సిగ్గుగా చట్టాలను అమలు చేయం అని చెబుతున్నారు రాష్ట్రంలో గతంలో కార్మికుల పక్షాన పోరాడే వారు కార్మిక మంత్రులుగా ఉండేవారు ఇప్పుడు రాష్ట్రంలో శ్రమ దోపిడీ చేసే మల్లా రెడ్డి కార్మిక మంత్రిగా ఉన్నారని అన్నారు.కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.