దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రమాబాయి అంబెడ్కర్ 88వ వర్ధంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ R&B గెస్ట్ హౌస్ లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రమాబాయి అంబెడ్కర్ 88వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ అయ్యల సంతోష్ మాట్లాడుతూ మాతా రమాభాయి ప్రపంచ మేధావిగా అంబేద్కర్ ను తీర్చిదిద్ది దేశానికే దీపమై, భారత దేశ చరిత్రలో అమ్మ రమాబాయి తన త్యాగాల పునాదుల మీద బాబా సాహెబ్ ని ఒక మేను పర్వతంగా తాను నిలబెట్టింది. డాక్టర్ అంబేద్కర్ గారి ఒకొక్క మెట్టు వెనుక రమాబాయి బిగువున బిగపట్టిన బాధ తాలూకు గాయలున్నాయి. డాక్టర్ అంబెడ్కర్ కు ఎల్లవేళలా తోడుంటూ ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ జీవనం సాగించడం జరిగింది.ఆ సమయం లో ఇంటి బాధ్యతలు
రమాబాయి ఒక్కరే నెరవేరుస్తూ, బాబా సాహెబ్ ఉన్నత చదువులకోసం తాను ఎన్నో బాధలను అనుభవించింది.ఇల్లు గడవని స్థితిలో అమ్మ పిడకలు చేసి అమ్మేవారు ఆ డబ్బులతో ఇల్లు గడిచేలా చూడటమే కాకుండా అందులో కొంత డబ్బు డాక్టర్ అంబెడ్కర్ కి పంపించేవారు అన్నారు. కొక్కరుగా తన బిడ్డలు రాలి పోతున్నా మొక్కవోని ధైర్యం అమ్మ సొంతం ,ఎంతటి బాధనైన తన గుండెల్లోనే దాచుకుని బాబా సాహెబ్ కి ధైర్యాన్నీ నూరిపోసేవారు. ఈ దంపతుల
కష్టాలు వింటే పగవాడికి కూడా ఇన్ని కష్టాలు రావద్దని కోరుకుంటాం, ఈ ప్రతీ చదువు వెనుక అమ్మ రమాబాయి త్యాగo ఉంది అన్నారు. సమానత్వం కోసం ఆయన పడుతున్న తపణకు చలించిపోయేది, ఇదంతా చేస్తూ ఆయన ఆరోగ్యo కాపాడుకోలేక పోతున్నారు అంటూ అనుక్షణం తపన పడేది.తన కొడుకు చనిపోయినప్పుడు బాబా సాహెబ్ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి చూస్తూ తన కొంగు ను చింపి కొడుకు శవం మీద కప్పి, తమ పరిస్థితి ని ఎదుటివారికి చూపించకుండా జాగ్రత్త పడిన విషయం తెలిస్తే బాబా సాహెబ్ కోసం ఆమె పడిన ఆవేదన ఇట్టే అర్థం అవుతుంది అన్నారు. బాబా సాహెబ్ చదువులు,జ్ఞానం అమ్మ రమాబాయి భిక్ష. భావోద్వేగాల మాటలు అనుకునేల ఉన్నా తన తొమ్మిదేళ్ల వయసులో బాబాసాహెబ్ లోకి వచ్చి ముప్పయి ఏళ్ళు ఆయనతో ఉండి అత్యున్నత శిఖరాలు ఎదగడం లో రమభాయి పడిన కష్టo, ఈ భూమి మీద ఎవరికి ఇప్పటికి రాలేదు అనిపిస్తుంది. రమాబాయి అమ్మ అంటే త్యాగo రమాబాయి అమ్మ అంటే ఒక పోరాటం అని పేర్కొన్నారు. చివరికి ఈ పోరాటం అలిసి జబ్బుపడి, చివరిగా 1935 మే 27న విశ్వాంతరా లల్లో కలిసి పోయింది. రామభాయి త్యాగాలను వెలకట్టలేమని,రమభాయిని స్ఫూర్తిగా తీసుకోవాలని,ఆమె చేసిన త్యాగాలను, ఈ సమాజం మరిచిపోదని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి బీర్కూర్ మండల ప్రధాన కార్యదర్శి సంగు గోవర్ధన్, దళిత నాయకులు డాక్టర్ రాములు, గంగాదర్,బాలకృష్ణ, కల్లేటి సాయిలు, బేగరి సంతోష్, గైని సాయిరాం, హాసిని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.