జడ్చర్ల డిగ్రీ కళాశాలలో నాణేల ప్రదర్శన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన రుద్రంగి గంగాధర్ నాణేల సేకరించడంలో ఎంతో ఆసక్తి చూపేవాడు. ఈ నేపథ్యంలో తాను ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లిన ఈ కొత్త ప్రాంతానికి వెళ్లిన అక్కడ గల నాణేలను సేకరించి వెంట తెచ్చుకునే వాడు. ఈ నాణేల సేకరణ పట్ల ఆసక్తితో ఇప్పటివరకు కొన్ని వేల రూపాయల విలువచేసే నాణేలను ఆయన సేకరించడం జరిగింది. తాను స్వీకరించిన నాణేలను పలుచోట్ల ప్రదర్శన రూపంలో ఉంచడమే కాకుండా ఆ నాణేలు ఏ ప్రాంతానికి చెందినవి ఏ కాలం నాటివి ఎంత విలువ చేసేవి అని పూర్తి వివరాలను తాను సందర్శనకు ఉంచిన వాటి గురించి వాటిని తిలకిస్తున్న వారికి వివరించి చెప్పేవాడు. ఈ సందర్భంగా ఇటీవల మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లోని డాక్టర్ బి.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో నాణేల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు లెక్చరర్ల బృందం విద్యార్థులు సైతం ఆయనను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.