ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ టి ఎస్ సి ఎస్సి చైర్మన్ రాజీనామా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ టి ఎస్ సి ఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగుడాల  సుధాకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగుల, యువకుల, విద్యార్థుల జీవితాలకు ముడిపడినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీక్ కావడానీకు పూర్తి భాద్యత ప్రభుత్వానిదే నన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకూడదన్న దృక్పథంతో ప్రశ్నాపత్రాలను లీకేజీ ప్రభుత్వమే లీకేజీ చేసిందని ఆయన ఆరోపించారు.2014 లో దాడాపౌ 2 లక్షల ఉద్యోగాలు ఖాలీ ఉండగా  కొత్తగా ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా పై ఖాళీలు భర్తీ చేయకుండా ఎన్నికల సంవత్సరమైనా ఈ సంవత్సరంలో 66 వేల పోస్టులకు అనుమతించి అందులోనూ ఉన్నత ఉద్యోగ పోస్టులను తమ వారికే వచ్చే విధంగా పరిమితి లీకేజీలకు అనుమతించిందని ఆయన ఆరోపించారు. ఈ వివాదాన్ని సంబంధిత కార్యాలను మాత్రమే పరిమితం చేస్తూ స్కాం ప్రభావం తమపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని పేర్కొన్నారు. లేకపోతే టి ఎస్ సి ఎస్సి చైర్మన్, సెక్రటరీ నియంత్రణలో పేపర్ నియంత్రణ ఉంటుందని కానీ వారికి తెలియకుండా పేపర్ లీకేజీ ఎలా జరుగుతుందని సుధాకర్ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రత్యక్ష దోశలతో పాటు అందుకు కారణమైన వారిని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈక్రమం లో క్రమంలో నియామకాలు వాయిదా పడకుండా చర్యలు చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు

Leave A Reply

Your email address will not be published.