పరీక్షా పేపర్స్ లీక్ చేసి విద్యార్థులు జేవితాలతో ప్రభుత్వం చలగాటం

- బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి నల్లమేకల విజయ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి యువత విద్యా దీక్షలు చేపడుతుంటే పరీక్షా పేపర్స్ లీక్ చేసి ప్రభుత్వం విద్యార్థులు జీవితాలతో చలగాటమాడుతుందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి నల్లమేకల విజయ విమర్శించించారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ టి ఎస్ సి ఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే పదవినుండి తోలిగించాలని విజయ డిమాండ్ చేసారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగులయువకులవిద్యార్థుల జీవితాలకు ముడిపడినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీక్ కావడానికి  పూర్తి భాద్యత ప్రభుత్వానిదే నన్నారు. రాత్రింభవళ్లు కష్టపడుతూ యువత పుస్తకాల పురుగుగా మారుతోంది.. కానీ కొందరు అక్రమార్కుల చేష్టలతో వారిలో నిరాశ నిస్ప్రుహలు నెలకొంటున్నాయి. ఉద్యోగాల భర్తీలో వరుసగా తప్పులు జరుగుతుండడంతో వారిలో ఆందోళన మొదలైంది. చిన్న చిన్న ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినా టీఎస్ పీఎస్ సీ  పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉంటుందనే భావన ఇన్నాళ్లు ఉండేది. కానీ గత ఎనిమిదేళ్లుగా ఈ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో లోపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అవి ఎగ్జామ్ పేపర్ లీకయ్యే వరకు దారి తీశాయి. అయితే మొదటి లోపాన్ని గుర్తించినప్పుడే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. 2015లో సింగరేణి ఉద్యోగాల భర్తీ నుంచి నేటి ఏఈ ఎగ్జామ్ వరకు టీఎస్ పీఎస్ సీ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అక్రమాలు బయటపడ్డాయి. కానీ ప్రభత్వ చర్యలు తీసుకోక పోవడం తో అక్రమార్కుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని నల్లమేకల విజయ ఆందోళన వ్యక్తం చేసారు.

Leave A Reply

Your email address will not be published.