ఉద్రిక్తంగా మారిన అసెంబ్లీ పరిసరాలు

• పోలీస్ వాహనాలకు అడ్డుకున్న కార్యకర్తలను ఎత్తిపడేస్తున్న పోలీసులు.... • వందలాది మంది కార్యకర్తలను ఈడ్చిపారేస్తున్న పోలీసులు • పోలీసులు డౌన్... డౌన్ అంటు నినదిస్తున్న బీజేపీ కార్యకర్తలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ హైదరాబాద్: బండిసంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించుకుని సికింద్రాబాద్ వైపుగా తీసుకెళ్లారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు నిరసన తెలుపుతున్నారు.

• బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ….. అసెంబ్లీ, గన్ పార్క్ రోడ్లపై బైఠాయంచిన బీజేపీకార్యకర్తలు, మహిళా, యువ మోర్చా నేతలు

• గన్ పార్క్ వద్ద బండి సంజయ్ అరెస్ట్ ద్రుశ్యాలు చిత్రీకరిస్తున్న జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లపైనా పోలీసుల జులుం

• పలువురు జర్నలిస్టులు, కెమెరామెన్లపై లాఠీలు ఝుళిపించిన మఫ్టీ పోలీసులు

• పోలీసుల లాఠీఛార్జ్ లో సాక్షి ఫొటోగ్రాఫర్ రాజేష్, వెలుగు ఫొటో గ్రాఫర్ సురేష్ రెడ్డిలకు గాయాలు

Leave A Reply

Your email address will not be published.