గ్రూప్-1 ప్రిలిమ్స్‌ టీఎస్‌పీఎస్సీ రద్దు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్ష తో పాటు టౌన్‌ ప్లానింగ్‌వెటర్నరీ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌ పేపర్లను రద్దు చేసింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నిందితుడు ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ లో ఇప్పటికే గుర్తించిన మూడు పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటుమరో రెండు పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు కూడా ఉన్నట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అవి కాక.. ఎంవీఐగ్రౌండ్‌వాటర్‌ ఎగ్జామ్‌ పేపర్లు కూడా అతడి పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు గుర్తించామని ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రంలాగా మిగతా పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లను సైతం ప్రవీణ్‌ ఇంకెవరికైనా ఇచ్చాడాలేక అతడి పెన్‌డ్రైవ్‌కు మాత్రమే అవి పరిమితమయ్యాయాఅనే విషయాన్ని తేల్చేపనిలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు నిమగ్నమయ్యారు. అలాగేప్రవీణ్‌ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా.. పలువురు మహిళల నగ్నచిత్రాలుఅశ్లీలపదజాలంతో కూడిన చాటింగ్‌లు, 50కి పైగా నగ్న వీడియోలు ఉన్నట్టు తెలిసింది. అతడికి న్యూడ్‌ కాల్స్‌ చేసిన మహిళలు ఎవరో గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు.

Leave A Reply

Your email address will not be published.