అన్నదాతలను ఆగం చేస్తున్న ప్రాధమిక వ్యవసాయ సహాకార సంఘం (సొసైటీ) అధికారులు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండలములో నాలుగు సహకార సంఘాల సొసైటీ లు ఉన్నాయి…ఈ సహకార సంఘాలు తమ పరిధిలో అన్నదాతలకు వ్యవసాయ నిమిత్తం కొరకు,,మరియు,ఇతర వ్యాపారం కోసం రుణాలు తీసుకుంటారు,.అన్నదాతలు లేనిదే సహకార సంఘాలు లేవు బ్యాంకులు లేవు,అటువంటి అన్నదాతలను గత నెల రోజులుగా సాహకార సంఘ *(సొసైటీ) , అధికారులు మోసపూరిత మైన రుణాల పేరిట అన్నదాతల ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఎన్నికల ముందు ఓట్ల కోసం మరీ పిలిచి పిలిచి రుణాలు ఇచ్చి మరి ఓట్లు వేరించుకున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు. ఇప్పుడు అదే అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్నదాతల ఇంటికీ పంపి ఇబ్బంది పెడుతున్నారు, మరీ కుర్చీలు వేసుకుని,టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారు,దేశానికె అన్నం పెట్టే రైతులకు ఇట్లా మేడ మీద కత్తి పెట్టి రుణం చెల్లిస్తావ లేక చస్థావ అని వడ్డిమీద వడ్డీ వేసి దానిమిద చక్ర వడ్డీ వేస్తే అన్నదాతలు ఏమై పోవాలో ,ఒక్కసారి,ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించండి, ఈ అధికారులు గత 8 ఎనిమిది సంవత్సరాల నుంచి నిద్ర పోయినారా, ఇన్ని రోజులు ఎమ్ చేసిండ్రు? మీలాంటోళ్లే ఎనకటికి ఒకడు,కన్నతల్లికి అన్నం పెట్టానోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట అని సామెత చెప్పినట్లు.

మీ సహకార సంఘాల సొసైటీ లో కొన్ని లక్షలాది డబ్బులు పక్కదారి పడుతుంటే లెక్కలు అడగాల్సింది పోయి, రికార్డులు పరిశీలించకుండా, చుట్టం సుపుగా వచ్చి గుడ్డిగా సంతకాలు పెట్టి *నట్టుకోడి,చేపల పులుసు, చికెన్ బిర్యానీ ,బీర్లు, మద్యం సేవించి మత్తులో వెళుతున్నారు. పంట చేతికి అందని సమయములో మధ్యలో వచ్చి ఇబ్బంది పెడితే ఎట్లా అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అన్నదాతలకు గత 3 సంవత్సరం నుంచి వ్యవసాయం సరిగ్గా దిగుబడి రాక పెట్టుబడికి తెచ్చిన అప్పులకు మిత్తులు కట్టలేక, పిల్లలు చదువులకు ఫీజులు కట్టలేక,తినడానికి నిత్యా సరుకుల అవసరాలకు డబ్బులు లేక లోబో దిబో మని బాధపడుతున్న తరుణంలో ఈ సహకార సంఘాల పేరిట అధికారులు. ఇప్పుడు డబ్బులు లేని సమయంలో వచ్చి ఇట్లా అన్నదాతలను ఇబ్బంది పెడితే రైతులు ఏ మైపోవాలి, అన్నదాతలు సహకార సంఘాల అధికారుల పెరు మీద ఆత్మహత్య చేసుకోవాలా* , అది మిరే చెప్పాలి ,తక్షణమే *అధికారులు ఈ మోసపూరిత మైన రుణాల పేరిట దాడులు అపకుంటే ఈ నసురుళ్లబాద్ మండల రైతులు ,రైతు సంఘాల నాయకులు కలసి సహకార సంఘాల సొసైటీ ఆఫీస్ ల ముందర ధర్నాలు చేయడం జరుగుతుంది* అన్నదాతలు విజ్ఞప్తి మేరకు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల పై ఎట్లయితే దాడులు చేస్తున్నారో అదేవిధంగా,అన్నదాతల డబ్బులు, లక్షలు,,కోట్లు,, దోసుకుని ,బంగ్లాలు,భూములు, కార్ల మీద జల్సాలు చేస్తున్న సాహకార సంగం లో పని చేస్తున్న అధికారుల మీద, అధికారుల ఆస్తుల మీదా,మరియు సాహకార సంఘాల మీద* తక్షణమే సోదాలు చెయ్యాలని, మరియు, సహాకార సొసైటీ సంఘాల ఆఫీసు లపై సోదాలు సేసి రికార్డులు పరిశీలించాలని నసురుళ్లబాద్ మండల అన్నదాతల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.