25న ఇస్రో స‌హాయంతో 36 ఇంట‌ర్నెట్ శాటిలైట్ల‌ ప్ర‌యోగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భార‌తీ ఎంట‌ర్‌ప్రైజ‌స్  ప్రోత్సాహంతో వన్‌వెబ్ కంపెనీ .. ఇస్రో స‌హాయంతో 36 ఇంట‌ర్నెట్ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించ‌నున్న‌ది. మార్చి 25వ తేదీన ఆ ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది. గ్లోబ‌ల్ ఎల్ఈవో కాన్‌స్టెల్లేష‌న్‌లో భాగంగా ఆ ప్రాజెక్టును చేప‌ట్టారు. శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్నుంచి ఆ శాటిలైట్ల‌ను ప్రయోగిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్‌వెబ్ సంస్థ 18 సార్లు శాటిలైట్ల‌ను ప్ర‌యోగించింది. ఈ ఏడాది ఇది మూడ‌వ ప‌రీక్ష కానున్న‌ది.36 శాటిలైట్ల ప్ర‌యోగం సంద‌ర్భంగా వ‌న్‌వెబ్ కంపెనీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వ‌న్‌వెబ్ చ‌రిత్ర‌లో ఇది ప్ర‌తిష్టాత్మ‌క మైలురాయిగా నిలుస్తుంద‌ని చెప్పారు. వ‌న్‌వెబ్ శాటిలైట్ల‌ను ఇస్రో ప్ర‌యోగించ‌డం ఇది రెండ‌వ‌సారి అవుతుంది. ఇస్రోకు చెందిన క‌మ‌ర్షియ‌ల్ విభాగం ఎన్ఎస్ఐఎల్ఈ ప్ర‌యోగాన్ని నిర్వ‌హిస్తుంది. లాంచ్ వెహికిల్ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా .. లో ఎర్త్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ల‌ను పంప‌నున్నారు.వ‌న్‌వెబ్ కంపెనీ ఇటీవ‌ల స్పేస్ఎక్స్ ఫాల్క‌న్‌-9 రాకెట్ ద్వారా 40 ఇంట‌ర్నెట్ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.