భద్రాద్రికి బియ్యపు గింజలపై  లిఖించిన 1,01,116 శ్రీరామ నామాలను తలంబ్రాల సమర్పణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల  30 న పవిత్ర పుణ్య స్కేత్రమైన భద్రాచలం లో  జరుగనున్న శ్రీ రామ నవమి కళ్యాణం కొరకు సూక్ష్మ కళాకారిణి చలువాది మల్లి విష్ణు వందన భద్రాద్రికి బియ్యపు గింజలపై  లిఖించిన 1,01,116 శ్రీరామ నామాలను తలంబ్రాల సమర్పించారు.ఈ సందర్బంగా సూక్ష్మ కళాకారిణి చలువాది మల్లి విష్ణు వందన మాట్లాడుతూ శ్రీరామ నామాన్ని విశ్వవ్యాప్తంలో మరింతగా ప్రచారంలో భాగంగా గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మా కుటుంబ సభ్యులకు అందిందన్నారు. మాకు ఈ రోజు భద్రాచలం   శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో చక్కని దర్శన భాగ్యం కలిగిందని, దీంతోపాటు మరో 36 వేల లిఖించిన శ్రీరామ నామాలను మరో 6 ఆలయాలకు అందచేయనున్నామని తిలిపారు.దీంతో ఇప్పటివరకు 7,52,864 బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని వ్రాయడం జరిగింది.2016 నుండి నేను తలపెట్టిన ఈ వైభవ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి నమస్సుమాంజలి తెలిపారు. ముఖ్యంగా ఇందుకు సహకరించిన డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డికి ప్రత్యెక అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.