బతికున్న నన్ను చంపెయ్యకండి

- సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: కోట శ్రీనివాసరావు గురించి సోషల్‌ మీడియాలో ఓ విషాదబరితమైన వార్త తెగ ప్రచారం జరిగింది. చనిపోయారన్నది ఆ వార్త సారాంశం. అయితే, ఈ విషయంపై కోట స్పందించారు. తాను ఆర్యోగంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘నేను మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. నా ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని వస్తున్న వార్తలన్నీ అసత్యాలే. నేను ఆరోగ్యంగానే ఉన్నా. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ప్రచరాం చేయడం భావ్యం కాదు. ఈ వార్తలు చూసి నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కలత చెందారు. అంతా ఫోన్లు చేసి పరామర్శించడం చాలా ఇబ్బంది కలిగించింది. వదంతులు నమ్మొద్దు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. సోషల్‌ మీడియాలో అసత్యప్రచారాలు చేయడం ఓ వ్యాపారంలా భావిస్తున్నారేమో బతికున్న నన్ను చంపెయ్యకండి’ అంటూ కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని.. తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు కోరారు.

Leave A Reply

Your email address will not be published.