ఘనంగా ఆంధ్ర మహాభారత అవతరణ ఉత్సవాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీమదాంధ్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది ఉత్సవాలను చౌటుప్పల్లో పాలకుర్ల శివయ్య స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  విద్యార్థులకు ఆదికవి నన్నయ రచించిన పద్య కంఠస్థ పోటీలు నిర్వహించారు. నన్నయ రచించిన భార తంలోని ‘శ్రీవాణి గిరిజాశ్చరాయ’ పద్యంతో పోటీలకు శ్రీకారం చుట్టారు. ఆరు పాఠశాలల విద్యార్థులు పోటీలో పాల్గొని పద్యగానం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన అక్షర కళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి బడుగు మాట్లాడుతూనన్నయ కవిత్వంలో అక్షర రమ్యత కనిపిస్తుందని కొని యాడారు. అనంతరం పద్యాల పోటీల విజేతలకు బహు మతులు అందజేశారు. సాహిత్యం, విద్య, వైద్య విభాగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న శ్రీరాములు, శివరంజని, ప్రియాం కలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫౌండేషన్ అధ్య క్షుడు పాలకుర్ల మురళి, మండల పరిషత్ మాజీ ఉపాధ్య క్షుడు బొంగు జంగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.