ఏపీ అసెంబ్లీ లో రెండు కీలక తీర్మానాలు

తెలంగాజ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ అసెంబ్లీ లో రెండు కీలక తీర్మానాలు చేశారు. బోయ, వాల్మీకి కులస్తులను ఎస్టీల్లో చేర్చాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలంటూ మరో తీర్మానం చేశారు. ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదని, మతం మారినంత మాత్రాన దళితుల స్థితిగతుల్లో మార్పురాదని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశా ల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆఖరి రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం(ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల ఆందోళనలతో రసాభాస చోటు చేసుకుంది. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

ప్రశ్నోత్తరాల్లో భాగంగా నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లలో భాగంగా 30 లక్షల మందికి ఇంటి స్ధలాలు కేటాయించామని మల్లాదివిష్ణు తెలిపారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. మల్లాది విష్ణు వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సభలో ఆందోళనకు దిగారు. పోడియం వైపు దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.