గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ మంట కాస్త తగ్గించింది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని అదే రాయితీని మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఒక్కో సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ అందిస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా 12 సిలిండర్ల వరకు రూ.200 చొప్పున సబ్సిడీ అందిస్తుంది. అంటే ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ మరో ఏడాది పాటు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయల రాయితీ వర్తించనుంది. ఇక ఉజ్వల కాకుండా సాధారణంగా గ్యాస్ సిలిండర్ వాడేవారికి మాత్రం ఎలాంటి సబ్సిడీ అందించట్లేదు. దీనిని గతంలోనే ఎత్తేసింది.

ప్రస్తుతం 9.59 కోట్ల మంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధి పొందనున్నట్లు వెల్లడించారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్. వీరందరికీ ప్రతి 14.2 కేజీల LPG గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీ అందుతుందని ప్రకటించారు. ఈ సిలిండర్ల వాడకంపై రాయితీ పరిమితిని సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్ల వరకు మాత్రమే అందిస్తుంది. ఏడాదిలో అంతకంటే ఎక్కువ వాడితే అదనంగా వాడే వాటికి మాత్రం సబ్సిడీ అందదన్నమాట. ఇక ఈ సబ్సిడీ కోసం 2022-23 కోసం ప్రభుత్వంపై రూ.6100 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.7,680 కోట్ల భారం పడుతుందని వెల్లడించారు ఠాకుర్.

Leave A Reply

Your email address will not be published.