అంధులు అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

- ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఫౌండర్ డాక్టర్ జవహర్ లాల్ కౌల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అంధులు అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఢిల్లీ ఫౌండర్ సెక్రటరీ జనరల్ డాక్టర్ జవహర్ లాల్ కౌల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఎల్బి నగర్ చింతలకుంట చెక్ పోస్ట్ జహంగీర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్(డిడబ్ల్యూఎబి) తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కౌల్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్(డిడబ్ల్యూఎబి) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆలిండియా కాన్ఫడరేషన్ ఆఫ్ బ్లైండ్(ఏఐసీబి) కార్యదర్శి పొన్నగోటి చొక్కారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవులను శాలువాలు, పూల మాలలు మెమోంటోలతో కౌల్ ఘనంగా సన్మానించారు. అనంతరం కౌల్ మాట్లాడుతూ గత 56 ఏళ్లుగా అంధుల అభ్యున్నతికి తమ సంస్థ ద్వారా ఉపకార వేతనాలు, పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. రూ.300 వందలతో ప్రారంభం అయి రూ.400 కోట్లు పంపిణీ దేశవ్యాప్తంగా చేశామన్నారు. వర్క్ షాప్ లు నిర్వహించుకునేందుకు అంధుల భవనానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. యూపీ ప్రతాప్ ఘాట్ లో గత మూడేళ్లుగా 160 మంది అంధులకు రూ.15 వేలు అందజేసి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చామన్నారు. నల్లగొండ జిల్లాలో వరుసగా కమ్యూనిటి బేస్ రెహబిలేషన్ నిర్వహించామని అన్నారు. చొక్కారవు మాట్లాడుతూ తమ సంస్థచే నిర్వహించబడుతున్న నల్లగొండ అంధుల పాఠశాల సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసిస్తున్నారని తెలిపారు. సుమారు 100 పైగా ఉద్యోగాలలో స్థిరపడ్డారని చెప్పారు. హైదరాబాదులో ఇంతవరకు తాత్కాలిక కార్యాలయమే ఉండేదని నేడు పూర్తిస్థాయి కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. అంధులకు ఇబ్బంది కరంగా ఉన్న జివొ.27ను వెంటనే రద్దు చేయాలన్నారు. సిఎం కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ పెట్టి చురుకు పాత్ర పోషిస్తున్నందున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బ్లైండ్ లకు ఓకే భాష ఉండేలా కృషి చేయాలని అన్నారు. త్రిభాష సూత్రం అమలు చేయాలన్నారు. లేదా గతంలో మాదిరిగా 6 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించాలన్నారు. అంధుల కోసం అన్ని ప్రత్యేక పాఠశాలలను ఒకే గొడుగు కిందకు సంక్షేమ శాఖ లేదా విద్యా శాఖ కిందకు తీసుకురావాలన్నారు. తెలంగాణలోని 4 అంధ పాఠశాలలకు బోధనా మాధ్యమం అంటే తెలుగు మీడియం నుండి ఇంగ్లీషు మీడియం వరకు ఇంగ్లిష్‌గా మార్చాలన్నారు. మొత్తం 3 భాషల్లో అంటే స్థానిక భాష, ఇంగ్లీష్, హిందీలో చదువుకోవడానికి అనుమతించడం ద్వారా దేశంలో రాష్ట్రంలోనైనా పని చేయగలిగే అవకాశం ఉంటుందన్నారు. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 28 జూలై 1944న జన్మించిన కౌల్ ఆయన చిన్న వయసులోనే మశూచి కారణంగా కంటి చూపును కోల్పోయారన్నారు. అమృత్‌సర్ అంధుల కళాశాలలో అత్యధిక మార్కులు సాధించి విద్యారంగంలో అగ్రశ్రేణి విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిపారు. 1967లో పంజాబ్ యూనివర్శిటీ నుంచి సంస్కృతంలో బీఏ చేశారన్నారు. మే 1967లో లండన్ నుండి వచ్చిన రిటైర్డ్ ప్రొఫెసర్ మదన్‌లాల్ ఖండైవాల్ సహాయంతో ఢిల్లీలో అంధుల కోసం శిక్షణ, పునరావాస సొసైటీని స్థాపించారని తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని 1987లో ‘ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ది ఖైద్’ని స్థాపించారన్నారు. దేశంలోనే అతిపెద్ద ‘బ్రెయిలీ ప్రెస్’ని స్థాపించి కౌల్ ను భారత ప్రభుత్వం ఈ బ్రెయిలీ ప్రెస్‌ని రెండుసార్లు ఉత్తమ బ్రెయిలీ ప్రెస్‌గా ప్రకటించిందని తెలిపారు. 2014లో భారత ప్రభుత్వంచే ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, డ్వాబ్ వైస్ ప్రెసిడెంట్ కర్నాటి విజయ్ కుమార్, డ్వాబ్ ప్రెసిడెంట్ కొల్లు వెంకటసుబ్బయ్య, ఆల్ ఇండియా రేడియో దక్షిణామూర్తి, అంజయ్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అన్నదానం చేసిన బాబు రావు, బ్యాగులు పంపిణీ చేసిన సాయి ప్రసాద్ రెడ్డి లకు చొక్కారావు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.