దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్న తెలంగాణ పోలీస్

-  రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర పోలీస్ అత్యుత్తమంగా శాంతి, భద్రతలు కాపాడుతూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోమ్ మంత్రి ఎం.డి. మహమూద్ అలీ అన్నారు. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ  స్థానిక ఎమ్మేల్యే  వెంకటరమణారెడ్డి, డి.జి.పి. అంజని కుమార్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో  కలిసి దాదాపు 10 కోట్లతో  నిర్మించిన 4 పోలీస్  స్టేషన్ భవనాలను ప్రారంభించారు.భూపాల్ పల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీకి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోం శాఖ మంత్రి అనంతరం మొగుళపల్లి లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం టేకుమట్లలో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను నేరుగా పలిమేల, కాళేశ్వరం పొలీస్ స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి అక్కడ నిర్వహించిన సభలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కెసిఆర్ 2001 ఏప్రిల్ 27న ఉద్యమ పార్టీ స్థాపించారని, తెలంగాణకు సాధన కోసం ఇతర పార్టీల మద్దతు తీసుకునే సందర్బంగా అనేక అపోహలు అవరోధాలు దాటుకుంటూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాధించారని అన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన కోత్తలో శాంతి భద్రతలు తప్పడం, నక్సలిజం పెరుగుతుందనే వంటి అనేక అపోహలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన పోలీసు శాఖ పటా పంచలు చేసిందని, దేశంలోనే అత్యుత్తమంగా శాంతి భద్రతలను కాపాడుతూ మన పోలీసులు ఆదర్శంగా నిలిచారని హోం మంత్రి తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో అధిక పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.700 కోట్లు ఖర్చు చేసి పోలీసులకు ఆధునిక పేట్రోలింగ్ వాహనాలు అందించారని,   డయల్ 100 వ్యవస్థను పటిష్టం చేశారని హోంమంత్రి పేర్కొన్నారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలో విశ్వాసాన్ని పెంపొందించామని,  నూతన పోలీస్ నియామకాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని హోంమంత్రి తెలిపారు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక షీ టీమ్స్ లు అద్భుతమైన విజయాలు సాధించి  దేశానికి ఆదర్శంగా నిలిచారని, అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్నారని హోంమంత్రి పేర్కొన్నారు. నూతన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పించామని,  రాజకీయ జోక్యాన్ని తగ్గించామని, పోలీస్ శాఖ అమలు చేస్తున్న నూతన విధానాల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 8 సంవత్సరాలలో క్రైమ్ రేట్ తగ్గిపోయిందని, దేశంలో సురక్షితమైన మహా నగరంగా హైదరాబాద్  నిలిచిందని అన్నారు.ఆధునిక నేరాలను అరికట్టేందుకు అవసరమైన పరిజ్ఞానం, వసతులు పోలీస్ శాఖకు అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.

దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న సిసి కేమేరాల్లో 64% మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టామని తెలిపారు. సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశామని అన్నారు. గతంలో పోలీసుల పట్ల ఉన్న భయం స్థానంలో ప్రస్తుతం గౌరవం ఏర్పడిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా శాంతిభద్రతలు ఉన్న కారణంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ అవసరాలు 3 రేట్లు పెరిగినప్పటికీ నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, ఇంటింటికి త్రాగునీరు మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, రైతు సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని హోం మంత్రి తెలిపారు.ప్రజలకు పరిపాలన చెరువు చేసేందుకు 23 నూతన జిల్లాలు ఏర్పాటు చేశామని, జపాన్ దేశంలో పోలీసులు పౌరులకు స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి సహాయం చేస్తారని, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పోరుల సమస్యలు పరిష్కారానికి పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎన్నారై స్నేహితులు తెలుపడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

 గతంలో పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం ఎలాంటి నిధులు ఇచ్చేవారు కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతినెల పట్టణ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ నిర్వహణకు 75 వేలు, రూరల్ ప్రాంతంలో 50 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 25 వేలు అందిస్తున్నామని అన్నారు.  కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ జక్కుల శ్రీహర్షిణీ మాట్లాడుతూ    అటవీ సంరక్షణ చేసుకుంటూ ప్రజలకు భద్రత కల్పించేందుకు  అటవీ ప్రాంతాలైన పలిమేల, కాళేశ్వరం లో పోలీస్ స్టేషన్ నూతన భవనాలు నిర్మించుకోని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. పలిమేలలో పోలీస్ భవన నిర్మాణానికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మహీళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి షీ టీం ఏర్పాటు చేసి ప్రతి మహిళకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎం.పీ   పసునూరి దయాకర్ మాట్లాడుతూ  ప్రజలతో స్నేహపూర్వక వైఖరి అనుసరిస్తు పోలిస్ శాఖ కట్టుదిట్టంగా శాంతి భద్రతలను అమలు చేస్తుందని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపి అంజని కుమార్ మాట్లాడుతూ. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 200 కోట్లతో నూతన పోలీస్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, భూపాల్ పల్లి, ములుగు మహబూబాబాద్ జిల్లాలలో 38 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ జిల్లా పోలీస్ కార్యాలయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వరంగల్ పోలీస్ కమిషనరేట్ భువన నిర్మాణానికి  50 కోట్ల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు . పోలీసు సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని, న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభించిన 4 నూతన పోలీస్ స్టేషన్ భవనాలు ద్వారా ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలని  సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక నేరస్థులను 24 గంటల వ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. శాంతిభద్రతల అంశంపై సీ.ఎం. కేసీఆర్ ప్రాధాన్యత కల్పిస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నరని, పోలీస్ ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా మంచి ఫలితాలు లభించాయని  తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ నేరస్థుల పట్ల పోలీసులు భయం సింహస్వప్నంలా ఉండాలని ఎమ్మెల్యే కోరారు.

 టేకుమట్ల మండలంలో 2.5 కోట్ల ఖర్చు చేసి కార్పోరెట్ స్థాయిలో పోలిస్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, ఇక్కడ భూ సమస్య ఏర్పడితే ప్రత్యేక 2.5 ఎకరాలు కోనుగోలు చేసి ఆ సమస్యను పరిష్కరించామని, ఇదే ప్రాంగణంలో తహసిల్దార్ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయం వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. పోలీసు స్టాఫ్ క్వార్టర్స్, కాంపౌండ్ వాల్ మంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యే కోరగా, ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తామని హోమ్ మినిస్టర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ , వరంగల్, జిల్లా ప్రజా పరిషత్ చైర్పెర్సన్, గండ్ర జ్యోతి,  జిల్లా కలెక్టర్ భవష్ మిశ్రా ,జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, స్థానిక ప్రజా ప్రతినిధులు తాసిల్దార్ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.