ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి

-  బీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి కడియం శ్రీహరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి కడియం శ్రీహరిఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకార్యకర్తలకు పిలుపునిచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గ వేములపల్లి మండల బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు.బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు,మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు కొందరు వస్తారని వారిని నమ్మవద్దని కోరారు. శ్రుతి మించుతున్న బీజేపీదుర్మార్గాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న శక్తి సామర్ధ్యాలు ప్రత్యర్థులకు ఏ మాత్రం లేవని పేర్కొన్నారు.పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్నాయకత్వంలో తొమిదేండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు . బీఆర్ఎస్ దేశానికే రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను కేంద్ర ప్రభుత్వం తమ స్వార్ధ రాజకీయాల కోసం ఏవిధంగా ఉపయోగించుకుంటున్నదో ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.