టీటీడీ కీ కేంద్ర ప్రభుత్వం రూ. 4.31 కోట్లు జరిమానా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  టీటీడీ కీ కేంద్ర ప్రభుత్వం రూ. 4.31 కోట్లు జరిమానా విధించింది. శ్రీవారికి విదేశీ భక్తులు  ఆన్‌లైన్ ద్వారా నగదు రూపంలో కానుకలు పంపుతుంటారు. కొందరు భక్తులు తమ వివరాలు తెలుపకుండా గోప్యత పాటిస్తూ ఉంటారు. ఇలా వివరాలు వెల్లడించని వారి నుంచి సుమారు రూ. 26 కోట్లు వచ్చాయి. ఆ మొత్తాన్ని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడేళ్లుగా పక్కన పెట్టేసింది. దీంతో సమస్యను పరిష్కరించాలని టీటీడీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖలను అందుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీకి 2019 సంవత్సరానికి రూ. 1.014 కోట్లు జరిమానా విధించారు. ఈ ఏడాది మార్చి 5న కేంద్ర ఎఫ్‌సీఆర్‌ఏ విభాగం వార్షిక రిటర్న్‌లో హుండీలో కానుకలు వేసిన వారి చిరునామాలు లేవని టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ రాస్తూ మళ్లీ రూ. 3.19 కోట్లు జరిమానా విధించింది. అంటే మొత్తం రూ. 4.31 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ (ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ ని దుయ్యబడుతూ ఇదేనా ఓ ఆధ్యాత్మిక సంస్థతో కేంద్రం వ్యవహరించడం అంటూ ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.