పులివెందులలో కాల్పుల కలకలం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు అయిన సునీల్ యాదవ్ కు బంధువు.. ఈకేసులో సీబీఐ అధికారుల విచారణ ఎదుర్కొన్న భరత్ యాదవ్ తాజాగా కడప జిల్లా పులివెందులలో కాల్పులు జరిపారు. పులివెందుల పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసు వద్ద ఈకాల్పులు జరిగాయి. గతంలో భరత్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు ఓ ఆర్థిక తగాదాలో భరత్ యాదవ్ కాల్పులు జరపడం.. ఒకరు మరణించడం.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడం కడప జిల్లాలో చర్చనీయాంశమైంది.పులివెందులలో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో దిలీప్ అనే వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తి భాషాకు తీవ్ర గాయాలయ్యాయి. డబ్బుల విషయంలో భరత్ కుమార్ యాదవ్ కు దిలీప్ కు మధ్య గొడవలు అయినట్టు సమాచారం. భరత్ కుమార్ దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి మధ్య ఘర్షణ జరిగిందని.ఇంటికి వెళ్లి తుపాకీ తీసుకువచ్చిన భరత్ కుమార్ యాదవ్ అక్కడే ఉన్న దిలీప్ మహబూబ్ పాషాలపై కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు కాల్చాడని మహబూబ్ తెలిపాడు.గాయపడ్డ వీరిని వెంటనే స్థానికులు పులివెందులలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో దిలీప్ చనిపోయాడు. మహబూబ్ పాషా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.కాల్పులు జరిపిన భరత్ కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. భరత్ కుమార్ గతంలో రిపోర్టర్ గా పనిచేసినట్టు ప్రచారం సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.