ప్రస్తుతం కెసిఆర్ ఆస్తులు ఎన్నో చెప్పాలి

- ఈటల సవాల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మిషన్ భగీరథ నీళ్ళు తాగడానికి పనికి రావడం లేదని, మళ్లీ మినరల్ వాటర్ ప్లాంట్స్‌కి గిరాకి పెరిగిందని ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.    2011 తర్వాత 13 ఏళ్లకు మళ్లీ గ్రూప్‌-1 వేశారని ఎమ్మెల్యే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు నింపే TSPSCలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారని, 30 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఈటల మండిపడ్డారు. పేపర్‌ లీక్‌లో తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత అని, జైల్లో ఉండాల్సింది పేపర్‌ లీక్ చేసినవారని, తెలంగాణ మహిళ ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేయొచ్చా? అని ఈటల ప్రశ్నించారు. తప్పు చేస్తే శిక్ష తప్పదు, చేయకపోతే బయటికి వస్తారని ఈటల అన్నారు. బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం మోసమని అన్నారు.ఇటీవల ప్రధాన నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మంత్రి కేటీఆర్, హరీష్ రావులపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో కేటీఆర్ ఈటల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణా సీఎం కేసీఆర్ ఆస్తులపై మాట్లాడిన ఈటల రాజేందర్ తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ ఆస్తులు ఎన్ని ఉన్నాయని.. ప్రస్తుతం కెసిఆర్ ఆస్తులు ఎన్నో చెప్పాలని సవాల్ విసిరారు. పార్టీ నుంచి తాను వెళ్ళిపోలేదని, పార్టీ నుంచి తనను బలవంతంగా వెళ్లగొట్టారని పేర్కొన్న ఈటల రాజేందర్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తనను చిల్లర గుండా నాయకులతో తిట్టిస్తున్నారని పేర్కొన్న ఈటల రాజేందర్ తెలంగాణ కోసమే పుట్టానని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటికైనా భూమి మీద నడవాలంటూ మండిపడ్డారు.

 

Leave A Reply

Your email address will not be published.