ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య యోజన కార్డు నమోదుకు  విశేష స్పందన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని తొమ్మిదవ వార్డు నందు బిజెపి మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గాలి సంపత్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తలపెట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య యోజన కార్డు నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లబించింది.ఈ కార్యక్రమానికి  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి పాల్గొని దిశా నిర్దేశనం చేసారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గౌరవ ప్రధాని మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ యొక్క మహోత్తర  కార్యక్రమాన్ని మన తెలంగాణలో కూడా అమలు చేయమని చేయవలసిందిగా కోరితే మన రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుందని నెపంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కెసిఆర్ ప్రభుత్వంకీ సిగ్గుచేటన్నారు.బిఆర్ఎస్ పార్టీ తలవంచుకునే పని చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి అనేకమంది పేద ప్రజలు దాదాపుగా 1500 మందికీ పైగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమం 4గంటల సమయానికే ముగియనుండగాఎక్కువ జనాలు రావడం మూలాన సమయాన్ని 6 గంటల వరకు పొడిగించడం జరిగింది.దాదాపుగా ఇంకా వెయ్యి మందికి పైగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.ఈ సందర్భంగా గాలి సంపత్ యాదవ్ కుమార్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పేద ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా చేయాల్సిన అవసరం ఉన్నా! కూడా!! ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని పేద ప్రజల పైన వారు సవతి ప్రేమ చూపిస్తున్నారని ఓట్ల కోసం మాత్రమే వారు నీచ రాజకీయాలు చేస్తూ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దమ్మాయిగూడ బీజేపి అధ్యక్షులు మోర నాగ మల్లారెడ్డి, రవీందర్ గౌడ్, బుచ్చిరెడ్డి,,సుజాత నాయక్, పద్మావతి, వరగంటి శోభ ,,తోట నరేష్ పటేల్ ,, పరమేష్ గౌడ్, బీబీసీ రాజు, మల్లేష్,శేఖర్,నాయక్, శ్రావణ్, మధుసూదన్, ఆంజనేయులు, శ్రీనివాస్,మీసేవ నిర్వాహకులు నరసింహ గౌడ్ , మరియు తదితర కాలనీల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.