హెచ్‌-1బీ వీసా జీవిత భాగ‌స్వాముల‌కు గుడ్‌న్యూస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికాలో హెచ్‌-1బీ వీసా ఉన్న భార‌తీయులు ఆ వీసా ఉన్న వారి జీవిత‌భాగ‌స్వాములుకూడా ఉద్యోగులు చేసుకోవ‌చ్చు అని తాజాగా ఓ న్యాయ‌మూర్తి తీర్పును ఇచ్చారు. ఒక‌ర‌కంగా ఈ ఆదేశాలు భార‌తీయ టెకీల‌కు భారీ ఊర‌ట క‌ల్పించింది. అమెరికాలో ఉన్న టెక్నాల‌జీ కంపెనీలు చాలా వ‌ర‌కు హెచ్‌-1బీ వీసాల‌ను జారీ చేస్తాయి. ఇండియాచైనా లాంటి దేశాల‌కు చెందిన వేలాది మంది ఉద్యోగుల‌పై ఆ కంపెనీలు ఆధార‌ప‌డుతాయి.అయితే గ‌తంలో ఒబామా ప్ర‌భుత్వంజారీ చేసిన ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ కోర్టును ఆశ్ర‌యించింది. హెచ్‌-1బీ వీసా ఉన్న భాగ‌స్వాములు కూడా ఉద్యోగం చేసుకోవ‌చ్చు అన్న నిబంధ‌న ఎత్తివేయాల‌ని ఆ సంస్థ కోరింది. అయితే ఆ పిటిష‌న్‌ను అమెరికా జిల్లా జ‌డ్జి తాన్యా చుక్ట‌న్తిర‌స్క‌రించారు.హెచ్‌-1బీ వ‌ర్క‌ర్ల వ‌ల్ల త‌మ‌కు ఉద్యోగాలు రావ‌డం లేద‌ని సేవ్ జాబ్స్ యూఎస్ఏఆరోపిస్తున్న‌ది. కానీ ఆ సంస్థ వేసిన పిటీష‌న్‌ను మాత్రం అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ‌లు వ్య‌తిరేకిస్తున్నాయి. హెచ్‌-1బీ వీసాలు ఉన్న జీవిత భాగ‌స్వాముల్లో సుమారు ల‌క్ష మందికి అమెరికా సర్కారు వ‌ర్క్ ప‌ర్మిట్లు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది

Leave A Reply

Your email address will not be published.