10/10 వచ్చిన ప్రతి విద్యార్థికి పదివేల రూపాయలు బహుమతి అందిస్తాం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: సత్తుపల్లి నియోజకవర్గంలోని బీసీ హాస్టల్ లో పదో తరగతి చదువుతున విద్యార్థులు ఈనెల మూడు నుంచి జరగబోయే పరీక్షల్లో 10/10 సాధించిన ప్రతి విద్యార్థికి పదివేల రూపాయలు ఇవ్వనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ అన్నారు శుక్రవారం నాడు సత్తుపల్లిలోనే బీసీ హాస్టలోని విద్యార్థులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు చిల్లపల్లి మాధవరావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ తో కలిసి విద్యార్థుల పరీక్షలకు అవసరమైన ఫ్యాడ్లు, పెన్నులను బహుమతులు గా అందజేశారు అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ హాస్టల్లో చదువుకునే ప్రతి విద్యార్థి ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీ పడాలని బీసీ హాస్టల్స్ లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థుల కన్నా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అటువంటి విద్యార్థులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు, సత్తుపల్లి మండల అధ్యక్షులు పామర్తి నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి గుడిదా రామకృష్ణ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తినవలి రంగారావు, నియోజకవర్గ కార్యదర్శి వీరవాడ నాగభూషణం, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కోటా సత్యనారాయణ, యువజన విభాగం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బెజవాడ సాయి శేషు, యువజన విభాగం సత్తుపల్లి నియోజకవర్గ కార్యదర్శి తిరుమలరావు, సత్తుపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రాయలకోటి, యువజన. మరియు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.