కొత్త కోవిడ్ లక్షణాలు ఏమిటి, ఎంతకాలం ఉంటాయి ?

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  దేశంలో కోవిడ్-19(COVID-19) కేసులు క్రమంగా పెరుగుతున్నాయిమార్చి మొదటి వారంలో రోజువారీ సగటు కేసులు 313 ఉండగా..మూడవ వారంలో రోజువారీ 966కి పెరిగాయి. మహారాష్ట్రగుజరాత్కర్ణాటక,తమిళనాడు,ఢిల్లీ వంటి రాష్ట్రాలు అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.COVID-19, ఫ్లూ లక్షణాలు నిజానికి ఒకేవిధంగా ఉంటాయి. COVID-19 ఉన్న చాలా మంది వ్యక్తులు చాలా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారుఇవి మూడు నుండి ఐదు రోజుల వరకు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఫ్లూ విషయానికి వస్తేఈ ఏడాదిలో మూడు నుండి ఐదు వారాల పాటు కొనసాగే దగ్గును చూస్తున్నాం. ఫ్లూ రోగులలో దగ్గును నియంత్రించడానికి కొన్నిసార్లు యాంటీ అలర్జీ మందులుదగ్గు సిరప్‌లు ఇస్తున్నట్లు చెబుతున్నారు.ప్రస్తుతం చాలా చాలా కోవిడ్ కేసులు తీవ్రంగా లేవు. ఎక్కువగా దగ్గుముక్కు కారటంజ్వరం వంటి ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా తక్కువ మందికి మాత్రమే ఆసుపత్రి అవసరం అవుతోందంటున్నారు. వృద్ధులుమధుమేహందీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా ఊబకాయం ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి చెందిన డాక్టర్ అతుల్ గోగియా చెప్పారు.ప్రస్తుతం ఆస్పత్రుల్లో మాత్రమే కోవిడ్ 19 చికిత్సకు జనరిక్ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఔషధం వ్యాధి తీవ్రతను బట్టిఆసుపత్రిలో చేరే ప్రమాదం ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి. బీపీగుండె సంబంధిత మందులు వాడేవారికి కోవిడ్19 ఔషధాలు డాక్టర్ల సూచన మేరకు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.

Leave A Reply

Your email address will not be published.