తన రిటైర్ మెంట్ ప్లాన్‌ను వాయిదా వేసుకున్న సోనియా గాంధీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2024 లోక్‌సభ ఎన్నికలనేపథ్యంలో యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన రిటైర్ మెంట్ ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారు. రాహుల్అనర్హత అంశంపై విపక్షాలను ఏకం చేసేందుకు ఆమె తిరిగి యాక్టివ్ అయిపోయారు. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టి 2004లో యూపిఏ చైర్‌పర్సన్‌గా విపక్షాలను ఏకతాటిపై నిలిపారు. నాడు ఎన్డీయే బలం 138. యూపిఏ గెలిచిన స్థానాలు 145. తమ కంటే కేవలం 7 సీట్లు తక్కువ వచ్చినా ఎన్డీయేనుఅధికారంలోకి రాకుండా సోనియా విజయవంతంగా అడ్డుకున్నారు. 18 ప్రాంతీయ పార్టీలను యూపిఏతో కలిసేలా చేసి కీలకంగా వ్యవహరించారు. యూపిఏ ప్రభుత్వం 2004లోనూ, 2009లోనూ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. తన విదేశీయత అంశంతో దూరమై ఎన్సీపీ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్న శరద్ పవార్‌నుతిరిగి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మన్మోహన్ సింగ్‌ను(ప్రధానిని చేసి తానే చక్రం తిప్పారు. మళ్లీ ఇప్పుడు రాహుల్ అనర్హత, విపక్షాల అనైక్యత నేపథ్యంలో సోనియా తిరిగి యాక్టివ్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ఆమె చురుకైన పాత్ర పోషించేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారు.

Leave A Reply

Your email address will not be published.