ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలిదా!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీడిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన డిగ్రీ సర్టిఫికెట్ఫేక్ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీనేతలు రోజుకో ఆధారంతో ముందుకు వస్తున్నారు. ప్రధాని మోదీ తనకుతానుగా పాఠశాల విద్య తర్వాత చదువుకోలేదని చెప్పే వీడియోను వైరల్ చేయడమే కాకుండా.. 2016లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు మీడియా ముందు పెట్టిన ప్రధాని మోదీ ఎంఏ సర్టిఫికెట్‌కు ఇప్పుడు ఆప్ నేతలు శల్యపరీక్షలు నిర్వహించారు. అది ముమాటికీ ఫేక్ సర్టిఫికెట్ అంటూ ఘంటాపథంగా చెబుతున్నారు.

ఏమిటీ వివాదం?

2019 సార్వత్రిక ఎన్నికలసమయంలో గుజరాత్‌లోని వాద్‌నగర్, ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ లోక్‌సభ స్థానాల నుంచి నరేంద్ర మోదీ బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఆ సమయంలో రెండుచోట్లా సమర్పించిన అఫిడవిట్లలో.. తాను గుజరాత్ విశ్వవిద్యాలయంనుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. గుజరాత్ వర్సిటీకి సంబంధించిన సర్టిఫికెట్‌పై మరింత సమాచారం కావాలంటూ ఆప్ నేతలు ఆ విశ్వవిద్యాలయానికి సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమాచారం అందకపోవడంతో ప్రధాన సమాచార కమిషనర్ వద్ద అప్పీల్.. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగాయి. కోర్టు తీర్పు ఆప్‌కు వ్యతిరేకంగా రావడంతో.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్‌పై ప్రత్యక్ష దాడికి సిద్ధమయ్యారు.

ఫాంట్‌తో సహా ఆధారాలను వెలికితీసి..

ఆప్‌ అధికార ప్రతినిధిరాజ్యసభ సభ్యుడుసంజయ్‌సింగ్‌ ఏకంగా ప్రధాని పీజీ సర్టిఫికెట్‌లో తప్పులను బహిర్గతం చేస్తూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సర్టిఫికెట్‌లో ‘యూనివర్సిటీఅనే పదం తప్పు(యూనిబర్సిటీ- గా ఉందని చూపించారు. అంతేకాకుండా.. ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ అని పేర్కొన్న ఫాంట్1992లో ఉనికిలోకి వస్తే.. ఆయన పీజీ పూర్తిచేసింది 1983లో కావడం అది ఫేక్ సర్టిఫికెట్ అని సాంకేతికంగా నిరూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ ఫేక్ అని తేలితే.. కేంద్ర ఎన్నికల సంఘంనిబంధనల ప్రకారం ప్రధాని మోదీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారన్నారు.అంతేకాకుండా.. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత ఉంటుందని వివరించారు.

మోదీ పాత ప్రసంగాల్లో..

AAP ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌కూడా మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదేనంటూ పలు ఆధారాలను మీడియా ముందు పెట్టారు. ‘‘నరేంద్ర మోదీ ప్రధాని కాకమునుపు.. గుజరాతలో జరిగిన ఎన్నికల సమయంలో ఆయన తాను పాఠశాల తర్వాత విద్యను కొనసాగించలేదని చెప్పారు. ఆ వీడియో ఆధారాలున్నాయి. ఆ వ్యాఖ్యనే సెంటిమెంట్‌గా చేసుకుని మోదీ సీఎం అయ్యారు. అలాంటిది ఆయన 1979లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, 1983లో గుజరాత్ వర్సిటీ నుంచి ఎంఏ ఎలా పూర్తిచేయగలిగారు?’’ అని సౌరభ్‌ నిలదీశారు. ఈ ఆధారాలన్నీ ప్రధాని నరేంద్ర మోదీది ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ అని నిరూపిస్తున్నాయని, ఆయనపై అనర్హత వేటు తథ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

అనర్హత సాధ్యమేనా?

ఒక లోక్‌సభ సభ్యుడిపై అనర్హత వేటును ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 లోని సెక్షన్ 8 ప్రస్తావిస్తోంది. ఈ సెక్షన్‌లోని క్లాజులు నేరాలు నిరూపితమై.. రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడితే.. సభ్యత్వం కోల్పోతారని స్పష్టం చేస్తోంది. అయితే.. ఇందులో ఎక్కడా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని అందజేస్తే అనర్హత వేటు పడుతుందని చెప్పలేదు. ఇదే చట్టంలోని సెక్షన్ 125(ఏ) తప్పుడు అఫిడవిట్లను గురించి ప్రస్తావిస్తోంది. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే.. ఆర్నెల్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని స్పష్టం చేస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా పలుమార్లు కోర్టుల్లో ఈ విషయాన్ని పేర్కొన్నాయి. 2018లో ఎన్నికల కమిషన్‌తోపాటు.. సుప్రీంకోర్టు కూడా తప్పుడు అఫిడవిట్‌కు శిక్షలు పడేలా చట్టాలు చేయాలని పార్లమెంటును కోరినా.. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. దీన్ని బట్టి.. ఒకవేళ ఎన్నికల అఫిడవిట్‌లో ప్రధాని మోదీ తప్పుడు సమాచారం అందించారని ప్రాసిక్యూషన్ లేదా దర్యాప్తు సంస్థలు తేల్చినా.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత ఉండబోదని స్పష్టమవుతున్నట్లు రాజ్యాంగ/న్యాయ నిపుణుడు మెన్నేని సంతోష్ రావు మీడియా తో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.