చంద్రుడిమీద‌కు మ‌ళ్లీ వ్యోమ‌గాములను పంపనున్ననాసా  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చంద్రుడిమీద‌కు నాసామ‌ళ్లీ  వ్యామోగాముల్నిపంప‌నున్న‌ది. వ‌చ్చే ఏడాది న‌వంబ‌ర్‌లో ఆర్టెమిస్-2లూనార్ రాకెట్ ద్వారా ఆ ఆస్ట్రోనాట్స్ వెళ్ల‌నున్నారు. అయితే ఆ న‌లుగురు వ్యోమ‌గాముల పేర్ల‌ను సోమ‌వారం నాసా ప్ర‌క‌టించింది. రీడ్ వైజ్‌మాన్‌, విక్ట‌ర్ గ్లోవ‌ర్‌, క్రిస్టినా కోచ్‌, జెర్మీ హాన్‌సెన్‌లు చంద్రుడిపైకి వెళ్ల‌నున్నారు. రీడ్‌, విక్ట‌ర్‌లు నాసాకు చెందిన వాళ్లు కాగా, క్రిస్టినా, జెర్మీలు కెనిడియ‌న్ స్పేస్ ఏజెన్సీ వ్యోమ‌గాములు.ఆర్టెమిస్‌-2 మిష‌న్‌కు వైజ్‌మాన్ క‌మాండ‌ర్‌గా స‌ర్వ్ చేయ‌నున్నారు. 47 ఏళ్ల వైజ్‌మాన్ నేవీలో పైలెట్‌గా చేశారు. బాల్టిమోర్‌కు చెందిన అత‌ను గ‌తంలో అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌కు వెళ్లారు. 47 ఏళ్ల హాన్‌స‌న్ ఓ ఫైట‌ర్ పైలెట్‌. 2009లో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ కోసం కెన‌డా స్పేస్ ఏజెన్సీ అత‌న్ని తీసుకున్న‌ది. డీప్ స్పేస్‌లోకి వెళ్ల‌నున్న తొలి కెన‌డా వ్యోమ‌గామిగా ఆయ‌న నిలుస్తారు. 46 ఏళ్ల గ్లోవ‌ర్ రెండేళ్ల క్రితం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగ‌న్‌కు పైలెట్‌గా చేశారు. స‌పేస్ స్టేష‌న్‌లో ఆర్నెళ్లు కూడా ఉన్నాడు.మూన్ మిష‌న్‌లో ఉన్న ఏకైన మ‌హిళా ఆస్ట్రోనాట్ క్రిస్టినా కోచ్ వ‌య‌సు 44 ఏళ్లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఆరుసార్లు స్పేస్‌వాక్‌లో పాల్గొన్న‌ది. 328 రోజుల పాటు స్పేస్‌లో ఉన్న రికార్డు ఆమె పేరిట ఉంది. మిచిగ‌న్‌కు చెందిన ఆ వ్యోమ‌గామి ఏడాది పాటు ద‌క్షిణ ద్రువంలో కూడా గ‌డిపారు.

Leave A Reply

Your email address will not be published.