కాలువ వెంబడి పులి పిల్ల సంచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిన్న, మొన్నటి వరకు నసురుల్లాబాద్ వర్ని గ్రామ శివార్లలో చిరుత పులి సంచరిస్తున్నట్లు వచ్చిన వార్త కథనాలకు ఇరు మండలాల ప్రజలు రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే, జీవాల మేత కొరకు అటవీ ప్రాంతానికి వెళ్లాలంటే భయభ్రాంతులకు గురయ్యారు. తాజాగా నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి, నసురుల్లాబాద్, నెమ్లి గ్రామ శివారులో గల నిజాంసాగర్ ప్రధాన పంట కాలువ పక్కన అటవీ ప్రాంతంలో పులి పిల్ల తిరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. పులి పిల్ల తో పాటు దాని తల్లి సైతం అదే శివారులో తిరుగుతున్నట్లు పులి ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో అటువైపు పంట పొలాలకు వెళ్లే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.