పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పా టు చేయాలి

-    బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహిళలకు సమానత్వం మూఢ నమ్మకాలపై వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని… అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర భావితరాలకు అందించడానికి పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పా టు చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ.. దేశంలోనే మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే దంపతులు విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేయాలని కోరారు. రెండు ఎకరాలలో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ట్యాంక్బండ్పై మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల 150 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా భావించే జ్యోతిరావుపూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో విద్యా విప్లవం తీసుకువచ్చిన గొప్ప సంఘ సేవకులు పూలే దంపతులను కొనియాడారు. ఏప్రిల్ 11న పూలే జయంతి వేడుకల్లో విగ్రహ ఏర్పాటు పై ప్రకటన చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తం గా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటు పల్లి సురేశ్, గ్రేటర్   హైదరాబాద్ ఉపాధ్యక్షులు బిళ్ళ పండరినాథ్, మంగళపల్లి రమేశ్, జయరాజ్ , వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.