పడిన చోటే లేచి నిలుచోవాలని ఎమ్మెల్సీ కవిత పంతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పడిన చోటే లేచి నిలుచోవాలని ఎమ్మెల్సీ కవిత పంతం పట్టారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు.  తనను ఓడించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను చిత్తుచిత్తు చేయాలని పూనుకున్నారు. కేంద్రంపై పోరు చేయడానికి ఎంపీగా గెలవడం అత్యవసరం అని కవిత భావిస్తున్నారు. అందుకే తాజాగా నిజామాబాద్ ఎంపీగా మళ్లీ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. కవిత నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో వరుస సమావేశాలతో కాకరేపుతున్నారు.కేసీఆర్ కూతురుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కవిత ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలతో ఫోకస్ అయ్యారు. ఈ క్రమంలోనే తను ఎంపీగా మళ్లీ గెలిచి పార్లమెంట్ లో బీజేపీకి గట్టి పోటీనివ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే నిజామాబాద్ పార్లమెంట్ పై కవిత ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్రధానంగా కనిపిస్తోంది.  నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొని కేడర్ కు నేనున్నాంటూ భరోసానిచ్చారు. ఇక దీని తర్వాత ఆర్మూర్ భోదన్ మెట్ పల్లి సహా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ క్యాడర్ ను ఒక్కటి చేసే ప్లాన్ చేస్తున్నారు.నిజామాబాద్ లో మరింత యాక్టివ్ రోల్ పోషిస్తున్న కవిత రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. బీజేపీ దూకుడుకు చెక్ పెట్టడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. కేసీఆర్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కవితకు జాతీయ రాజకీయాల్లోనూ కీలక బాధ్యతలను కేసీఆర్ అప్పగించారని.. ఎంపీగా గెలిపించి ఆమెను ఢిల్లీలో కీరోల్ పోషించేలా చేస్తున్నట్టు సమాచారం.గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినప్పటి నుంచి రాజకీయంగా ఏడాది పాటు సైలెంట్ గా ఉన్నారు కవిత. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించి శాసనమండలిలో అడుగుపెట్టారు.ఇప్పుడు ఓడిన చోటనే గెలవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఓడించాలని నిజామాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా తనను ఓడించిన ఎంపీ అరవింద్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కవిత పట్టుదలతో పనిచేస్తున్నారని తెలుస్తోంది. వచ్చేసారి ఎంపీగా గెలిచి బీజేపీ పార్లమెంట్ లో నిలదీయాలని చూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.