బీసీ బాలుర వసతి గృహంలో పాము కాటుకు గురైన వంట సిబ్బంది

.. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియ ఆసుపత్రికి తరలింపు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: తెలంగాణలోని వసతీ గృహాలకు రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఏదో ఒక చోట వసతీ గృహాలలో విద్యార్ధి లేక సిబ్బంది పాముకాటు ఘటనలతో ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల 10 వ తేదీనా  కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్  మండల కేంద్రంలోని బిసి బాలుర వసతి గృహంలో పాము కాటుకు గురై నసురుల్లాబాద్ మండలం లోని దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ విద్యార్థి  మృతి చెందాడు. ఈ ఘటన మరువకముందే అదే వసతీ గృహంలో మంగళవారం మరో ఘటన చోటుచేసుకుంది. దసరా సెలవులు ముగియడంతో వసతి గృహంలో వంటశాలలో వసతి గృహ  సిబ్బందిగా పనిచేస్తున్న సక్కుబాయ్ అనే మహిళా బిసి బాలుర  హాస్టల్ పరిసరాలు శుబ్రం చేస్తూ, పిచ్చి మొక్కలు తొలగిస్తున్న సమయంలో  ఓ పాము అఖస్మాత్తుగాసక్కుబాయి కాలికి కాటు వేసింది. దీంతో ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం బాన్సువాడలోని ఏరియ ఆసుపత్రికికి తరలించారు.  ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వసతి గృహ సిబ్బంది  పేర్కొన్నారు. నిత్యం తెలంగాణ రాష్టం లోని  వసతీ గృహాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులని వసతి  గృహాలకు చదువుకునేందుకు  పంపించాలంటే తల్లితండ్రులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. కేవలం ఒకటిన్నర నెలల కాలం లోనే ముగ్గురు పాముకాటుకు గురికావడం పట్ల విద్యార్థులు తల్లితండ్రులు తమ పిల్లలను వసతీ గృహానికి పంపించాలంటే వెనుకంజ వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. వసతి గృహాల ద్వార తెలంగాణ ప్రభుత్వం విద్యర్టులకు నాణ్యమైన భోజనం, వసతులు కల్పించాలన్న సంకల్పం గొప్పదే అయినప్పటికీ సంబందిత అధికారుల అలసత్వమో,పాలకుల కు పట్టింపు లేనితనమో తెలియదు గాని విద్యార్థులకు  తిప్పలు తప్పడం లేదు.ఇప్పటికే గతంలో జరిగిన ఘటనకు  అధికారులు ఇంచార్జి వార్డెన్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే .అయినప్పటికీ వసతిగృహల నిర్వహణ తీరు మారక పోవడం గమనార్హం

 

Leave A Reply

Your email address will not be published.