బీసీ ప్రధానిగా ఉండి ఓసి లకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మోడీదే

-   బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో  ఏ ఒక్క అగ్రకుల ప్రధాన మంత్రులు చేయలేనటువంటి పనిని బీసీ ప్రధానమంత్రిగా ఉండి రాజ్యాంగానికి విరుద్ధంగా ఓసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదికే  దక్కిందని అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.నేడు హైదరాబాదులో మీడియాతో  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ సామాజిక వర్గం నుండి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని పదవి బాధ్యతలు చేపట్టారని,మోది ప్రదాని అయిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారని,దేశంలోని బీసీల ఆకాంక్షలను నెరవేరుస్తారని దేశ మొత్తంలో ఉన్న బీసీ సమాజం ఎదురుచూశారని,కాని ఈ తోమ్మిది సంవత్సరాల ఎదరుచూపులు ఎండమావిగా మారాయని,లేక,లేక ఒక్క సారి బీసీ ప్రధానిగా అయిన నరేంద్ర మోది  బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ పెంచకుండా, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టకుండా, బీసీ కులగణన చేయకుండా.. వాడివి అడుగున బీసీలను గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన ప్రధాని మోడీ పైగా ప్రదాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు బీసీల సమస్యల పరిష్కారానికి ఆలోచించకుండా, బీసీల ఆకాంక్షలు నెరవేర్చకుండా, సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రం బీసీ కార్డును వాడుకొని నేను ఓబీసీనని చెబుతూనే బీసీలను అన్ని రంగాల్లో అన్చివేసి బీసీలకు రావలసిన వాటాను అగ్రవర్ణాలకు కట్టబెట్టాడని  ఆయన అన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ మోడీని విమర్శించిన సందర్భంలో.. బిజెపి పార్టీ వారు ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని కించపరుస్తున్నారని,మోదిని కించపర్చితే ఓబిసీలను కించపరిచినట్టేనని దేశమంతా గగ్గోలు పెడుతున్నారని, కానీ ఓబీసీగా ఉండి ఓబీసీలకు ఏమీ చేయలేని  మోడీ తాను ఓబిసినని ఎలా చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు.దేశంలో ఎస్సీలకు ఎస్టీలకు వారి జనాభా దామాష్ ప్రకారం విద్య, ఉద్యోగ,ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయం జరుగుతుందని అదేవిధంగా మోదీ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో వారి జనాభా కంటే ఎక్కువగా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం పొందిన  అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు వారి జనాభా దామాషా కంటే అధికంగా  కల్పించారని కానీ ఇదే సమయంలో దేశంలో 60 శాతం ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్ ఉంటే మోడీ ప్రభుత్వం బీసీలకు ఇతర వరకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు  ఓబీసీలకు ఎందుకు కల్పించలేదో ప్రదాని బీసీ సమాజానికి  సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అంటే వ్యక్తిగతంగా తమకు ఎంతో గౌరవం ఉందని, కానీ ఓబీసీలకు అన్ని రంగాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంటే బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీలకు న్యాయం చేయలేక లేకుండా నిస్సాయస్థితిలో ప్రధానమంత్రి ఉండడం బీసీల గుండెలను బాధిస్తుందని ఆయన అన్నారు,   ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీ  సామాజిక న్యాయం అంటున్నారు తప్ప సామాజిక న్యాయం అమలు జరగాలంటే బీసీలకు జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన వాటా దక్కాలని ఎందుకు అనడం లేదని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా బిజెపి నేతలు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ బీసీల విషయంలో, డిమాండ్ల సాదనకు  చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో చరిత్రలో బీసీ ప్రధానమంత్రిగా ఉండి ఓసీలకు రిజర్వేషన్ కల్పించి.. బీసీలకు అన్యాయం చేసిన ప్రధానిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.