స్వర్ణకారులని చైతన్య అభివృద్ధి దిశగా నాయకత్వం పనిచేయాలి

- ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణు మాధవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వర్ణకారులని చైతన్య అభివృద్ధి దిశగా నాయకత్వం పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ పిలుపునిచ్చారు. యూపీ వారణాసిలో జరుగుతున్నఅఖిల భారతీయ స్వర్ణకార సంఘ సమావేశం లకో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హాజరైన ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ప్రసంగించిన వేణుమాధవ్ ప్రపంచీకరణ వల్ల మారిన స్వర్ణకారుల పరిస్థితిని కార్పొరేట్ సంస్థల చేతిలో నలిగిపోకుండా బ్యాంకుల ద్వారా స్వర్ణకార కుటుంబాలని ఆర్థిక పరంగా నిలిచే విధంగా నాయకులు తయారవ్వాలని ఆ రకంగా స్వర్ణకారులని చైతన్యం చేసి అభివృద్ధి దిశగా నాయకత్వం పనిచేస్తే ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా నాయకులు సామాన్య స్వర్ణకారులకు అండగా చైతన్యంతో కూడిన సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.ఆ రకంగా తీసుకువెళ్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా బ్యాంకులు స్వర్ణకారులు అండగా ఉండే పరిస్థితి ఉన్నదని  బ్రహ్మాండంగా  23 సంఘాలు 100 కోట్ల పైగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ముద్ర లోన్ తీసుకొని E M I చెల్లింపులు 96.5 చెల్లించి స్వర్ణకారుల నిజాయితీ నిబద్ధత చాటారని  రాష్ట్రంలో స్వర్ణకార నాయకత్వాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని నాయకత్వం  ముందుచూపుతో ఆలోచనతో సామాన్య స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసి వారిని చైతన్యం చేసి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లడం అని పోలీసులు వేదింపులు హాల్ మార్క్ ప్రభుత్వ నియమాలు మార్పుల కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బహదూర్ సింగ్ వర్మ,  ప్రధాన కార్యదర్శి రవి వర్మ, యుపి అధ్యక్షుడు రవి షరాఫ్, ప్రధాన కార్యదర్శి రాహుల్ , దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఈసీ నెంబర్లు హాజరయ్యారు

Leave A Reply

Your email address will not be published.