పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్‌ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌ దగ్గర మీడియాతో మాట్లాడుతూ పంజరంలో నుంచి బయటపడినట్లు ఉందన్నారు. దొరలగడీ నుంచి బయటకు వచ్చాననిపార్టీ సభ్యత్వం చేస్తామంటే కూడా పుస్తకాలు ఇవ్వలేదన్నారు. తనను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే తనను సస్పెండ్ చేశారని జూపల్లి కృష్ణారావు అన్నారు.అంతకుముందు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు జూపల్లి కృష్ణారావు వచ్చారు. ఆయనను అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. స్పీకర్ అనుమతి లేదని చెప్పారు. దీంతో భద్రతా సిబ్బందితో జూపల్లి కృష్ణారావు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ ఆదేశాల మేరకే అనుమతి లేదని భద్రతా సిబ్బంది తెలిపారు.కాగా ఖమ్మం రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి.. పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలంతా ఏకతాటిపైకి వస్తారని.. ఇప్పటికే జూపల్లిపొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. జూపల్లి వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఇద్దరు నేతలు నిన్న అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా సీఎం కేసీఆర్మంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నర నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీపై ఆగ్రహంతో ఉంటూ వస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆయన మద్దతుదారులపై బీఆర్‌ఎస్ అధిష్టానం వేటు వేసింది. దమ్ముంటే తనపై వేటు వేయాలని ఇప్పటికే పొంగులేటి సవాల్ విసిరారు. ఈ క్రమంలో నిన్నటి ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేయాలని బీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధినేత కేసీఆర్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందన ఇరువురిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.