స్టాలిన్ ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

-    ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఆర్ఎఎస్ఎస్ ర్యాలీలపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎంకే స్టాలిన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వి.రామసుబ్రమణియన్పంజక్ మిథాల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావడంగాంధీ జయంతిని పురస్కరించుకుని ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించాలని గత ఏడాది అక్టోబర్‌లో తమిళనాడు ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ కోరింది. అయితేనిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా‘ నుంచి దాడుల ముప్పు ఉందంటూ ఈ ర్యాలీలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో మద్రాసు హైకోర్టును ఆర్ఎస్ఎస్ ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత ఏడాది నవంబర్‌లో కొన్ని షరతులపై ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై కూడా ఆర్ఎస్ఎస్ డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఎలాంటి షరతులు లేకుండా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ డివిజన్ బెంచ్ ఈ ఏడాది ఫ్రిబవరి 10న తీర్పు చెప్పింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ర్యాలీలను పూర్తిగా తాము వ్యతిరేకించడం లేదనినిఘావర్గాల హెచ్చరికలతోనే వీధివీధిన ర్యాలీలకు అనుమతించడం లేదని చెప్పింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. మద్రాసు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ స్టాలిన్ సర్కార్ పిటిషన్‌ను మంగళవారంనాడు కొట్టివేసింది. దీంతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

Leave A Reply

Your email address will not be published.