పేపర్ లీకేజీ విషయం లో బీ ఆర్ ఎస్ పై కుట్రలు చేస్తున్నారు

- ఎంపీ మాలోత్ కవిత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పేపర్ లీకేజీ విషయం లో బీ ఆర్ ఎస్ పై కుట్రలు చేస్తున్నారని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. 2014 నుండి సీఎం కేసిఆర్ పలు మార్లు మోడీ నీ కలిసి అడిగారు. కేటీఆర్ కూడా కేంద్రాన్ని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అదానీ కి లాభం చేకూర్చే విధంగా చర్యలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం కోసం కేసిఆర్ కృషి చేస్తున్నారు అన్నారు. బయ్యారం ఉక్కు గురించి ఒక్క మాట కూడా కాంగ్రెస్ మాట్లాడటం లేదు, బండి సంజయ్ ఎలక్షన్ ముందు రాజకీయాలు చేస్తున్నారు. పేపర్ లీకేజీ విషయం లో బీ ఆర్ ఎస్ పై కుట్రలు చేస్తున్నారు బైలదిల్ల లో ఉన్న ఉక్కు ను అదానీ కి కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది బైలాడిల్ల ఐరన్ ఓర్ ఆదానీ కి ఇవ్వకూడదు అన్నారు. కచ్చితంగా బయ్యారం లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందే.

… ఎంపి వద్దిరాజు రవిచంద్ర

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అన్ని పార్టీలు కలిసి రావాలి, అందరం కలిసి వెళ్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించవచ్చు బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజు కూడా సాగలేదు 13 నుండి 18 నిమిషాల్లోనే బడ్జెట్ ఆమోదించారు. ప్రతి ఒక్క ఎంపి ఈ విషయంలో కలిసి రావాలి 18 ప్రతి పక్ష పార్టీలు అందరూ కలిసి మోడీ కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో నిరసనలు తెలిపాము. బైలాధిల్ల ఉకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందే అన్నారు.

..మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణ విభజన చట్టం లో తెలంగాణ లో, ఏపిలో వేర్వేరు స్టీల్ ఫ్యాక్టరీ లు పెట్టాలని కేంద్రం చెప్పింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐరన్ గనులు నిక్షేపంగా ఉన్నాయి అక్కడ ఐరన్ ఓర్ గనులు లేవని మళ్ళీ కేంద్రం అంటోంది బైలడిల్ల నుండి ఐరన్ ఒర్ ఇస్తే ఇక్కడ ఉన్న గనులతతో ఫ్యాక్టరీ పెట్టొచ్చు బయ్యారం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లను కనుమరుగు చేసి 1800 కిలోమీటర్ల దూరంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని కేంద్రం చేస్తోంది నిన్న ఇదే విషయం పై కేటీఆర్ స్పష్టంగా చెప్పారు దీనిపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ తెర చాటు ఒప్పందాలు చేసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి ప్రైవేటీకరణకు వ్యతిరేకమే మా పార్టీ విధానం అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తో సుమారు 20 వేల ఉద్యోగాలు వచ్చేవి, పెట్టుబడి కింద రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించడానికి సిద్దంగా ఉన్నదని కేటీఆర్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.