ఆత్మీయ సమ్మేళనంలో తెగిపడ్డ కాళ్లు, చేతులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఖమ్మం జిల్లా కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర విషాదం జరిగింది. బాంబులు పేల్చగా దగ్గరలో ఉన్న గుడిసె పై పడి అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా 10 మందికి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.