రూ.800 కోట్ల విలువైన భూమిని..  కేవలం రూ.100 కోట్లకు యశోదా ఆసుపత్రికి దారాదత్తం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇప్పటివరకు ఎవరూ చేయనంత తీవ్ర ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. యశోదా ఆసుపత్రికి రూ.800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.100 కోట్లకు కట్టబెట్టేశా రంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇప్పటివరకు ఎవరూ చేయనంత తీవ్ర ఆరోపణలు చేశారు. గులాబీ బాస్ ఆస్తుల విలువ రూ.లక్ష కోట్లు ఉంటాయని.. వాటితోనే దేశ రాజకీయాల్నిప్రభావితం చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కేసీఆర్ భూముల్ని అమ్మితేనే రూ.2500కోట్లు వస్తాయని.. ఆ డబ్బుతో రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకోవచ్చన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన ఆరోపణలు చేశారు.ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యశోదా హాస్పిటల్స్ పైనా ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆసుపత్రికి రూ.800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.100 కోట్లకు కట్టబెట్టేశారంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాకు చెందిన అలెగ్జాండ్రియా అనే కంపెనీకి శేరిలింగంపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఐదు ఎకరాల స్థలాన్ని వైద్య ఆరోగ్య రంగంలో రీసెర్చ్ కోసం కేటాయించారని.. ఆ తర్వాత ధరను సవరించి ఎక్కువ ధర చెల్లించాలని హెచ్ఎండీఏ లేఖ రాసిందన్నారు. మారుతి సుజికి సంస్థకు సైతం ఇలాంటి పరిస్థితే ఉందన్నారు.దీంతో.. అలెగ్జాండ్రియా సంస్థ ఆ మొత్తాన్ని చెల్లించకుండానే కోర్టుకు వెళ్లిందని.. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడే తెలంగాణ ఆవిర్భించిందన్నారు. ఆ భూమిపై కల్వకుంట్ల మాఫియా కన్ను పడిందని.. అలెగ్జాండ్రియా కంపెనీని బెదిరించి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసు ఓడిపోయేలా చేసి రూ.500 కోట్ల విలువైన భూమిని అలెగ్జాండ్రియాకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు.కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు కూడా వెళ్లలేదన్న రేవంత్.. ఆ తర్వాత అదే సర్వే నెంబరులో ఉన్న మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అతి తక్కువకే కొట్టేశారు. ఈ భూమిని యశోదా ఆసుపత్రుల గ్రూప్ నకు గజం రూ.37611 చొప్పున కొనుగోలు చేసింది. వాస్తవానికి అక్కడ గజం రూ.లక్షల ధర పలుకుతుంది. ఈ భూమి వెనుకున్న భూమికి హెచ్ఎండీఏ గజం రూ.80వేలకు అప్ సెట్ ప్రెస్ గా నిర్దారించింది‘ అంటూ సంచలన స్కాంను బయటపెట్టారు.

లిక్కర్ స్కాంలో ఉన్న పెద్దలకు ఖానామెట్ లో 25 ఎకరాల భూమిని కట్టబెట్టారని.. ఇందుకోసం మంత్రి కేటీఆర్ కు 20 శాతం కమీషన్ ముట్టజెబుతున్నారన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు.. నాగార్జున సర్కిల్ లోని భవనాలకు అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారో చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు.తాను చేసే ఆరోపణలు సరికావని నిరూపిస్తే.. తాను ఏ శిక్షకు అయినా సిద్ధమన్నారు. ఉద్యమకారుడినని చెప్పే కేసీఆర్ కు వేల ఎకరాల భూములు.. ఫాంహౌస్ లు ఎలా వచ్చాయిఅని ప్రశ్నించారు. సూటిగా.. ఘాటుగా ఉన్న రేవంత్ ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Leave A Reply

Your email address will not be published.