పార్లమెంటులో బీసీ బిల్లు కై  ఈ నెల 29న ఛలో అనకాపల్లి

- బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి - రాజ్యసభ సబ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు ఏప్రిల్ -29న అనకాపల్లి లో 10వేల మందితో బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాజ్యసభ సబ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు.  శనివారం  ఆంధ్ర ప్రదేశ్ కు చెందినా ముఖ్యనాయకుల సమావేశం బిసి భవన్ లో ఆంధ్ర ప్రదేశ్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కన్వీనర్ దుర్గా నరేష్ అధ్యక్షత జరిగినది.  ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ,  ఉత్తరప్రదేశ్,  బీహార్,  హర్యానా,  రాజస్థాన్,  మహారాష్ట్ర,  కర్ణాటక,  తమిళనాడు  తదితర రాష్ట్రాలలో పర్యటించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో అన్నీ జిల్లాలలో భారీ బహిరంగ సభలు జరపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. బీసీలు పార్టీలకతీతంగా బలమైన బీసీ ఉధ్యమాన్ని నిర్మించాలని కోరారు. త్వరలోనే దేశవ్యాప్త పర్యటన చేస్తాను అని అన్నారు.ఈ దేశంలో గత 75 సంవత్సరాల గా పాలించిన కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాట్ ఇవ్వలేదు. ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలి కానీ 70 సంవత్సరాలు గడిచిన వాటా ఇవ్వడం లేదు. బి.సి లంటే ఉత్పత్తి కులాలు. దేశ సంపద సృష్టిస్తున్నారు. కాని సంపద అనుభవించే హక్కు లేదు. అవకాశం లేదు. పన్నులు కట్టే దేశ బడ్జెట్ ఇస్తున్నారు. కాని బడ్జెట్ లో కనీస వాటా లేదు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు. కాని అధికారులు బి.సి లకు వాటా ఇవ్వడం లేదు. ఈ దేశం లో బి.సిలకు ఇలా అన్యాయం జరుగుతుందన్నారు.

 రాష్ట్ర కన్వీనర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభా ప్రసాదం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు.  రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభలలో 50 శాతం సీట్లు అదనంగా పెంచి అత్యంత వెనుకబడిన కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ఈ సీట్లు ఇవ్వాలి. పంచాయతీరాజ్  సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు  రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశం లో  దుర్గా నరేష్, నివాస్, రాష్ట్ర మహిళ కన్వీనర్ హేమలత, సురేశ్, పృద్విగౌడ్, వరప్రకాశ్, విక్రం, రాకేశ్రాయుడు, మురలి, అశోక్, నూకరాజు, గణేశ్,   తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.