ముగిసిన సీబీఐ విచారణ..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. 161 సీఆర్‌పీసీ కింద ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్ను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షులు, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నించారు. మౌఖికంగా కేజ్రీవాల్ నుంచి సమాధానాలు తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో అక్రమాలు,.. కమీషన్ రేట్లను పెంచడం అంశాలపై ప్రశ్నించారు. సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో సంబంధాలపై సీబీఐ ప్రశ్నలు సంధించింది. సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకు.. మంత్రివర్గం ఆమోదం, సౌత్ గ్రూప్తో సంబంధాలపై సీబీఐ ప్రశ్నించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా.. కేజ్రీవాల్ను ప్రశ్నించారు.

కేజ్రీని అడిగిన మరికొన్ని ప్రశ్నలు ఇవే?

ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుల్లో మీ ప్రమేయం ఉందా ?

ఢిల్లీలో లైసెన్సులు పొందిన ప్రైవేట్ మద్యం వ్యాపారంతో మీకు సంబంధాలు ఉన్నాయా ?

నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ?

కమిషన్ రేట్లను 12 శాతానికి పెంచినట్లు మీకు తెలుసా..?

హోల్సేల్ వ్యాపారంలోకి ప్రైవేట్ కంపెనీలను ఎందుకు అనుమతించాల్సి వచ్చింది ?

విజయ్ నాయర్ మీ మనిషి అని మీరు సమీర్ మహేంద్ర కు చెప్తారా ?

మద్యం విధానం మద్యం వ్యాపారుల అనుకూలంగా రూపొందిస్తే.. మీ తరఫున ముడుపులు అందుకునేలా విజయ్ నాయర్ లిక్కర్ వ్యాపారులతో ,సౌత్ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకున్నారా ?

సమీర్ మహేంద్ర తో మీరు సమావేశం అయ్యారా..? ఫోన్లో మాట్లాడారా ?

ఢిల్లీ లిక్కర్స్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో మీకు సంబంధం ఉందా ?

సౌత్ గ్రూప్ తో మాట్లాడారా ?

సౌత్ గ్రూప్ కి ఆప్ కి మధ్య రాజకీయ అవగాహన ఉందా ?

ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ ముందుగానే ప్రైవేట్ వ్యాపారుల చేతిలోకి ఎలా వెళ్ళింది ? మీ ప్రమేయం ఉందా ?

లిక్కర్ వ్యాపారంలో ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా మనిషి సిసోడియ, సత్యేంద్ర జైన్ తో మీరు చర్చించారా ?

మీ నివాసంలో మనీష్ సిసోడియా కార్యదర్శి అరవింద్ కి ఒక డాక్యుమెంట్ ఇచ్చి దాని ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు చేయమని సూచించారా ?

మీ ఓఎస్డీ వైభవ్ సౌత్ గ్రూపులో ఉన్న సభ్యులతో సంబంధాలు నడిపారా ?

అంతకు ముందు కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా విచారిస్తోన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీ నివాసంలో ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. మాన్‌తో పాటు గోపాల్ రాయ్, పంకజ్ గుప్తా ఇతర సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కేసులో కేజ్రీని అరెస్ట్ చేస్తే తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం పదవి ఎవరు చేపట్టాలనే విషయంపై కూడా ఆప్ నేతలు చర్చించింనట్లు సమాచారం.

అంతకు ముందు కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను నిరసిస్తూ ధర్నా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ చద్దా సంజయ్ సింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేసినవారిలో వీరితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిషి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన దాదాపు 1,500 మంది ఆప్ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీథుల్లో కూడా ఆప్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపేందుకు పంజాబ్ నుంచి వచ్చిన తమ పార్టీ నేతలు, మంత్రులను సింఘు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. డాక్టర్ బల్బీర్ సింగ్, బ్రమ్ శంకర్ జింప, హర్‌జోత్ సింగ్ బెయిన్స్, కుల్జిత్ రణధవా, ఎమ్మెల్యే దినేశ్ చద్దా తదితరులను ఢిల్లీ నగరంలోకి అడుగు పెట్టనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాస్తవానికి కేజ్రీవాల్ ఈ ఉదయం 11.40 గంటలకు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI) కార్యాలయంలో హాజరయ్యారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొన్ని దేశ వ్యతిరేక శక్తులు భారత దేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. అయినప్పటికీ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఆ శక్తులకు తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ఆప్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, తదితర నేతలు ఉన్నారు. అనంతరం వీరంతా కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి, ప్రార్థనలు చేశారు.సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు కేజ్రివాల్ విడుదల చేసిన వీడియోలో, సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని సష్టం చేశారు. తనను అరెస్టు చేస్తారంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అధికార మదంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘మా మాట వినాలి.. లేదంటే జైల్లో పెడతాం’ అనే తరహాలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తానని తెలిపారు. ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి అడుగులు వేశానన్నారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. తనను జైల్లో పెడతామంటూ పదేపదే బెదిరిస్తున్నారన్నారు.

న్యూఢిల్లీ ఏప్రిల్ 17 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. 161 సీఆర్‌పీసీ కింద ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్ను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షులు, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నించారు. మౌఖికంగా కేజ్రీవాల్ నుంచి సమాధానాలు తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో అక్రమాలు,.. కమీషన్ రేట్లను పెంచడం అంశాలపై ప్రశ్నించారు. సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో సంబంధాలపై సీబీఐ ప్రశ్నలు సంధించింది. సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకు.. మంత్రివర్గం ఆమోదం, సౌత్ గ్రూప్తో సంబంధాలపై సీబీఐ ప్రశ్నించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా.. కేజ్రీవాల్ను ప్రశ్నించారు.

కేజ్రీని అడిగిన మరికొన్ని ప్రశ్నలు ఇవే?

ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుల్లో మీ ప్రమేయం ఉందా ?

ఢిల్లీలో లైసెన్సులు పొందిన ప్రైవేట్ మద్యం వ్యాపారంతో మీకు సంబంధాలు ఉన్నాయా ?

నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ?

కమిషన్ రేట్లను 12 శాతానికి పెంచినట్లు మీకు తెలుసా..?

హోల్సేల్ వ్యాపారంలోకి ప్రైవేట్ కంపెనీలను ఎందుకు అనుమతించాల్సి వచ్చింది ?

విజయ్ నాయర్ మీ మనిషి అని మీరు సమీర్ మహేంద్ర కు చెప్తారా ?

మద్యం విధానం మద్యం వ్యాపారుల అనుకూలంగా రూపొందిస్తే.. మీ తరఫున ముడుపులు అందుకునేలా విజయ్ నాయర్ లిక్కర్ వ్యాపారులతో ,సౌత్ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకున్నారా ?

సమీర్ మహేంద్ర తో మీరు సమావేశం అయ్యారా..? ఫోన్లో మాట్లాడారా ?

ఢిల్లీ లిక్కర్స్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో మీకు సంబంధం ఉందా ?

సౌత్ గ్రూప్ తో మాట్లాడారా ?

సౌత్ గ్రూప్ కి ఆప్ కి మధ్య రాజకీయ అవగాహన ఉందా ?

ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ ముందుగానే ప్రైవేట్ వ్యాపారుల చేతిలోకి ఎలా వెళ్ళింది ? మీ ప్రమేయం ఉందా ?

లిక్కర్ వ్యాపారంలో ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా మనిషి సిసోడియ, సత్యేంద్ర జైన్ తో మీరు చర్చించారా ?

మీ నివాసంలో మనీష్ సిసోడియా కార్యదర్శి అరవింద్ కి ఒక డాక్యుమెంట్ ఇచ్చి దాని ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు చేయమని సూచించారా ?

మీ ఓఎస్డీ వైభవ్ సౌత్ గ్రూపులో ఉన్న సభ్యులతో సంబంధాలు నడిపారా ?

అంతకు ముందు కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా విచారిస్తోన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీ నివాసంలో ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. మాన్‌తో పాటు గోపాల్ రాయ్, పంకజ్ గుప్తా ఇతర సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కేసులో కేజ్రీని అరెస్ట్ చేస్తే తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం పదవి ఎవరు చేపట్టాలనే విషయంపై కూడా ఆప్ నేతలు చర్చించింనట్లు సమాచారం.

అంతకు ముందు కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను నిరసిస్తూ ధర్నా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ చద్దా సంజయ్ సింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేసినవారిలో వీరితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిషి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన దాదాపు 1,500 మంది ఆప్ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీథుల్లో కూడా ఆప్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపేందుకు పంజాబ్ నుంచి వచ్చిన తమ పార్టీ నేతలు, మంత్రులను సింఘు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. డాక్టర్ బల్బీర్ సింగ్, బ్రమ్ శంకర్ జింప, హర్‌జోత్ సింగ్ బెయిన్స్, కుల్జిత్ రణధవా, ఎమ్మెల్యే దినేశ్ చద్దా తదితరులను ఢిల్లీ నగరంలోకి అడుగు పెట్టనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాస్తవానికి కేజ్రీవాల్ ఈ ఉదయం 11.40 గంటలకు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI) కార్యాలయంలో హాజరయ్యారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొన్ని దేశ వ్యతిరేక శక్తులు భారత దేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. అయినప్పటికీ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఆ శక్తులకు తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ఆప్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, తదితర నేతలు ఉన్నారు. అనంతరం వీరంతా కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి, ప్రార్థనలు చేశారు.సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు కేజ్రివాల్ విడుదల చేసిన వీడియోలో, సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని సష్టం చేశారు. తనను అరెస్టు చేస్తారంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అధికార మదంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘మా మాట వినాలి.. లేదంటే జైల్లో పెడతాం’ అనే తరహాలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తానని తెలిపారు. ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి అడుగులు వేశానన్నారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. తనను జైల్లో పెడతామంటూ పదేపదే బెదిరిస్తున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.