అంబేద్కర్ విగ్రహం సరే..గురుకుల, హాస్టల్స్ భవనాల సంగతేమిటి ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారని రాజ్యసభ సభ్యులు, జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం అతని అంకితభావానికి నిదర్శనం అన్నారు. అదే క్రమంలో అంబేద్కర్ వారసులు గా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి హాస్టలకు కొంత భవనాలు లేకపోవడం శోచనీయమన్నారు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు  అంబేద్కర్ వారసులకు చదువుకోడానికి హాస్టళ్లకు సొంత భవనాలు  లేక అందులో చదువుకునే వారికి సరైన ఫుడ్  లేక దొడ్లో  జంతువుల మాదిరిగా నకనక లాడుతున్నారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నీ తర్వాత వారసులకు మీరేం ఇవ్వాలనుకుంటున్నారని క్రిస్నయ్య ముఖ్య మంత్రిని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు  ఇస్తామని, దళితులకు మూడు ఎకరాల భూములు ఇస్తామని ఇస్తామని ప్రకటించినప్పటికీ అవి ఎంఎల్ఏల చేతుల్లోకి వెళ్ళాయన్నారు.రాష్ట్రంలో        రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు ఒకదానికి కూడా సొంత భవనాలు లేవు. భావితరాలకు వారసులైన వారికి కనీస అవసరాలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు సంవత్సరం నుండి బిల్డింగుల అద్దెలు  కట్టడం లేదని, కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల విద్యార్థుల చదువులు అగమ్య గోచరంగా మారాయన్నారు పరీక్ష సమయంలో హాస్టళ్ళుకు కరెంటు కట్ చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారు. పరీక్షలు ఎలా రాస్తారు. దీని ప్రభావం విద్యార్థుల పరీక్ష ఫలితాలపై  యుంటుందన్నారు. హాస్టళ్ళ కరెంట్ బిల్లులు గత 10నెలలుగా పెండింగ్ లో యున్నవన్నారు,కూరగాయలు, మాసం, గుడ్ల బిల్లులు  గత 10నెలలుగా చెల్లించడం లేదు. పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల బిల్లులు గత 10నెలలుగా చెల్లించడం లేదు. దీనితో హాస్టళ్లకు కూరగాయలు, పప్పులు, గుడ్లు తదితర వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టుర్లు అప్పుల పాలయ్యారు. నిత్యావసర వస్తువులు సరఫరా బందు చేస్తామని అంటున్నారు. దీనిమూలంగా హాస్టల్లో మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.విద్యార్థులకు హాస్టల్స్ బిల్డింగులు కట్టకపోతే ఎమ్మెల్యేల కోసం కట్టిన భవనాలను సొంతం చేసుకుంటామని క్రిష్నయ్య  హెచ్చరించారు. అంతేకాకుండా ప్రజలకు దూరంగా కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసి వాటిపై కలెక్టర్ ఆశ మహేష్ చేస్తూ వారి ఇష్టానుసారంగా దారని పోర్టల్ ను  మార్చుకొని కలెక్టర్లు కబ్జాలకు పాల్పడుతున్నారని కృష్ణయ్య ఆరోపించారు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా భూదండాలు  చేసే వారి ఆటలు కట్టిస్తామని అందుకుగాను ఒక మిల్టెంట్ గ్రూపును ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే ప్రజాప్రతినిధుల పై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో బీసీ ఎస్సీ ఎస్టీలతో కలిసి మహా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు మెస్ చార్జీలు పెంచి 40 రోజులు కావస్తున్నప్పటికీ ఇంతవరకు జీవో విడుదల కాకపోవడం అంబేద్కర్ వారసుల పట్ల ప్రభుత్వ ప్రభుత్వానికి ఉన్న చిట్టా శుద్ధికి నిదర్శనమన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం దివాలా తీసింది  అన్నది స్పష్టమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 32 లక్షల మంది పేదలకు స్థలాన్ని కేటాయించి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టిస్తున్నారని చెప్పారు తెలంగాణలో సైతం జగన్ ను ఆదర్శంగా తీసుకొని పేద ప్రజలకు ఇల్లు కట్టించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నీల వెంకటేష్, పవుడాల సుధాకర్ ముడురాజ్,, అనంతయ్య, రాజేందర్, గుజ్జ కృష్ణ యాదవ్, భూపేష్ సాగర్, వెంకట్ యాదవ్, ఎమ్. పృధ్వీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.