ఈ వృద్ధ మాజీ మహిళా మంత్రికి మంచి రోజులు వచ్చేనా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 70 ఏళ్ల పైబడి వయసులో ఉన్న నన్నపనేని రాజకుమారి 2019లో టీడీపీ ఓడిపోయాక మళ్లీ ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమె చురుకుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వినుకొండ లేదా సత్తెనపల్లి నియోజకవర్గాలపైన ఆమె కన్నేశారని.. ఈ రెండింటిలో తాను గతంలో గెలిచి ఉండటంతో మరోసారి అక్కడే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారని చెబుతున్నారు.ఉమ్మడి ఏపీలో ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు.. నన్నపనేని రాజకుమారి. 1983లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు.. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా కూలదోసి ఆ బాధ్యతలు చేపట్టినప్పుడు నన్నపనేని రాజకుమారి కూడా నాదెండ్ల వెంట నడిచారు. ఆయన కేబినెట్ లో మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నన్నపనేని రాజకుమారి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. తెనాలి ఆమె సొంత ఊరు అయినప్పటికీ గుంటూరు జిల్లాలోనే ఉన్న సత్తెనపల్లి వినుకొండల నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు.1983లో సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నన్నపనేని రాజకుమారి 1989లో వినుకొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ చీప్ విప్ గా కేబినెట్ మంత్రి హోదాలో పనిచేశారు. దేశంలోనే తొలి ప్రభుత్వ చీఫ్ విప్గా పేరు గడించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1994లో వినుకొండ నుంచే మరోసారి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.1994 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉండటంతో నన్నపనేని రాజకుమారి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఇంటి పేర్లతో వరసలు చుట్టరికాలు కలుపుకుంటూ టీడీపీ నేతలకు సన్నిహితంగా వ్యవహరించేవారు. ఈ వ్యవహారంలో సొంత పార్టీ కాంగ్రెస్ లో నన్నపనేని రాజకుమారి పై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా వాటిని ఆమె లక్ష్యపెట్టలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నన్నపనేని రాజకుమారి బాధ్యతలు చేపట్టారు.2014 ఎన్నికల్లోనే రాజకుమారి కుమార్తె డాక్టర్ నన్నపనేని సుధ వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సుధ రాజకీయాలకు దూరమయ్యారు.యితే చంద్రబాబు ఆమెకు సీటు ఇస్తారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న!

Leave A Reply

Your email address will not be published.